CM Chandrababu Naidu: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినాలో బీజేపీ విజయం చరిత్రామత్మకమని సీఎం అన్నారు. దేశ రాజధాని ప్రజలు బీజేపీని విశ్వసించారని చెప్పారు. రాజధానిలో వాయుకాలుష్యం పెద్ద సమస్యగా ఉందని.. అక్కడి నుంచి ప్రజలు ఇతర ప్రాంతాల్లోకి వెళ్తున్నారని అన్నారు. సంపదను సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతోందని.. మౌలిక వసతులు ఏర్పడుతాయని సీఎం పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నమ్మకంతోనే ప్రజలు కమలం పార్టీని గెలిపించారని అన్నారు. హస్తినాలో ఎన్డీఏ చారిత్రక విజయం సాధించిందని తెలిపారు. మంచి పాలన, నాయకత్వంలోనే రాష్ట్రంలో కానీ.. దేశంలో కానీ అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. మన దేశాని కరెక్ట్ సమయంలో సరైన నాయకుడు వచ్చారని.. అందుకే రాజధాని ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలుకుతుందని అన్నారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయన్నారు. వాటిని మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహరావు తీసుకొచ్చారని చెప్పారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగినట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 3000 డాలర్ల తలసరి ఆదాయం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అదే బిహార్ లో అయితే 750 డాలర్లుగానే ఉందని చెప్పారు.
‘టెక్నాలజీ సాయంతో మనం అభివృద్ధిలో ముందుకు వెళ్లాం. మనకు ఐటీ, మౌలిక వసతులు అభివృద్ధి దోహదకంగా మారాయి.సరైన సమయంలో సరైన నాయకత్వం చాలా కీలకం. స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్.. గుజరాత్ అభివృద్ధికి కారణం అయ్యాయి. కొందరు నేతలు సంక్షేమం, పథకాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు’ అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. కొందరు పొలిటికల్ లీడర్ల ప్రవర్తన, వ్యవహార శైలి కారణంగా దేశ రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోందని సీఎం ఫైర్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పాలనలో దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఎక్కడా చూసిన చెత్త, కాలుష్య పేరుకుపోయిందని.. కొన్ని పనుల కారణంగా అత్యంత కాలుష్య నగరంగా హస్తినా మారిందని మండిపడ్డారు. ఢిల్లీ పరిశుభ్రతను కేజ్రీవాల్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని.. అందుకే ఢిల్లీ ఇలా తయారైందని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్న కొందరు ఏమాత్రం మారలేదని చెప్పారు. లిక్కర్ స్కాంలో అవినీతి పనులు చేసిన ఏ ఒక్కరూ బాగుపడలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ , ఢిల్లీలో ప్రజల బాధలను, కష్టాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారని సీఎం ఫైరయ్యారు.
Also Read: Technician Jobs: HMFW తిరుపతిలో ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు.. జస్ట్ అప్లై చేస్తే చాలు..!
సంపదను సృష్టించలేని.. ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వలేని నేతలు దేశానికి, రాష్ట్రానికి ఎందుకని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ రుషికొండ ప్యాలెస్ కడితే.. ఢిల్లీలో కేజ్రీవాల్ శిష్ మహాల్ నిర్మించారని ఫైరయ్యారు. ఏపీ ప్రజలు తొందరగానే తమ తప్పులు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.