Weight Loss Mistakes: నేటి బిజీ లైఫ్‌లో బరువు పెరగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సరైన డైట్ తో పాటు వ్యాయామం చేసిన తర్వాత కూడా మీ శరీర బరువులో ఎలాంటి మార్పు కనిపించకపోతే మాత్రం మీరు కొన్ని పొరపాట్లు చేస్తున్నారని గమనించండి. ఉదయం లేచిన తర్వాత చేసే తప్పులే బరువు తగ్గకుండా చేస్తాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టిఫిన్ దాటవేయడం:
బిజీ లైఫ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం చాలా మంది చేస్తుంటారు. మీరు కూడా ఇలా చేస్తుంటే మాత్రం మీరు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. టిఫిన్ తినకుండా ఉంటే మీ జీవక్రియ మందగిస్తుంది. అంత కాకుండా మీరు బరువు తగ్గడంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
నీటి కొరత:
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీరు చేయవలసిన మొదటి పని 2-3 గ్లాసుల నీరు త్రాగడం. మీరు ఇలా చేయకపోవడంతో పాటు.. టీ లేదా కాఫీతో రోజు ప్రారంభించాలని అనుకుంటే మాత్రం బరువు పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అవుతుంది. శరీరం యొక్క డీహైడ్రేషన్ కారణంగా, జీర్ణవ్యవస్థ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది . ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గకుండా ఉంటుంది.
చెడు ఆహారపు అలవాట్లు:
చాలా మంది రోజంతా పోషకాహారం తీసుకుంటారు. . మీరు బంగాళాదుంపలు, అన్నం, క్యాలరీలు అధికంగా ఉన్న వాటిని తింటే మీరు బరువు ఎప్పటికీ తగ్గలేరు. అందుకే ఉదయాన్నే మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్‌తో పాటు పీచుపదార్థాలు ఉండేలా చూసుకోవడం మంచిది.
వ్యాయామం:
బరువు తగ్గడానికి డైట్‌తో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ఉదయాన్నే వ్యాయామం చేయడం మానేస్తే.. అది ఊబకాయానికి ప్రధాన కారణం అవుతుంది. అంతే కాకుండా జాగింగ్, రన్నింగ్ లేదా సైక్లింగ్ వంటి వ్యాయామాలతో రోజును ప్రారంభించడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గరు.