Vidhu Vinod Chopra: ఒక నటీనటుల దగ్గర నుండి ఎలా నటన రాబట్టాలి అనే విషయం దర్శకులకే ఎక్కువగా తెలుసు. అలాంటి సమయాల్లో దర్శకులు చేసే కొన్ని పనులు కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తుంటాయి. ఉదాహరణకు టాలీవుడ్‌లో దర్శకుడు తేజ.. పర్ఫెక్షన్ కోసం నటీనటులను కొట్టేవాడని టాక్ ఉండేది. అలాగే ఇతర దర్శకులు కూడా నటీనటులను చాలా ఇబ్బందిపెట్టేవారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించేవి. అలాంటి దర్శకులు బాలీవుడ్‌లో కూడా ఉన్నారు. వారిలో ఒకరు విధు వినోద్ చోప్రా. బీ టౌన్‌లో ఎన్నో ఏళ్లుగా సీనియర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విధు వినోద్ చోప్రా గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడగా అది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పర్ఫెక్షన్ కోసమే
విధు వినోద్ చోప్రా తెరకెక్కించే సినిమాలు బాగానే ఉన్నా ఆఫ్ స్క్రీన్ ఆయన జీవితంలో కాంట్రవర్సీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల ‘12త్ ఫెయిల్’ సినిమాతో హిట్ అందుకోగానే ఈ దర్శకుడి పేరు సౌత్‌లో కూడా మారుమోగిపోయింది. కానీ అంతకు ముందు కేవలం బాలీవుడ్ వరకే పరిమితయిన విధు వినోద్ చోప్రా గురించి అక్కడి నటీనటులు కథలు కథలుగా చెప్తారు. ఆయన పర్ఫెక్షన్ కోసం ఏమైనా చేస్తారని ఓపెన్ కామెంట్స్ చేస్తారు. అలా ఒకానొక సందర్భంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కూడా విధు వినోద్ చోప్రాతో ‘కరీబ్’ అనే సినిమా కోసం కలిసి పనిచేసినప్పుడు జరిగిన సంఘటనను బయటపెట్టారు.
Also Read: హీరోని చూసి పారిపోతున్న హీరోయిన్స్.. అసలేమైందంటే..?
చేయి కొరికేశాడు
1998లో బాబీ డియోల్, షబానా బాజ్‌పాయ్ హీరోహీరోయిన్లుగా ‘కరీబ్’ (Kareeb) అనే సినిమాను తెరకెక్కించారు విధు వినోద్ చోప్రా. అప్పటికీ హీరోయిన్‌గా షబానాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. దీంతో ఒక పాటలో తను పదేపదే తప్పుడు చేయిను పైకి ఎత్తిందట. దీంతో సహనం కోల్పోయిన విధు వినోద్ చోప్రా.. అలా జరగకుండా ఉండడం కోసం తను మర్చిపోకూడదని షబానా చేయిపై కొరికాడట. ఈ విషయాన్ని షబానా బాజ్‌పాయ్ భర్త మనోజ్ బాజ్‌పాయ్ స్వయంగా బయటపెట్టారు. తన భార్యతో అలా చేసినందుకు ఆయనకు కోపం రాలేదని, పర్ఫెక్షన్ కోసం అలా చేసే దర్శకులు ఉన్నారని చాలా సింపుల్‌గా ఈ సంఘటన గురించి మాట్లాడారు మనోజ్.
ప్రెజర్ అనిపిస్తుంది
షబానా బాజ్‌పాయ్ మాత్రం దర్శకుడు విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) చేసిన పని తనకు పెద్దగా నచ్చలేదని ఓపెన్‌గా చెప్పేసింది. మేకర్స్ అలా చేయడం వల్ల తనలాగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు చాలా ప్రెజర్ ఫీల్ అవ్వాల్సి వస్తుందని తెలిపింది. దర్శకుల అంచనాలు రీచ్ అవ్వడం కోసం ఏ రేంజ్‌లో కష్టపడాలో తనకు అప్పుడే క్లారిటీ వచ్చిందని చెప్పింది. అలా షబానా బాజ్‌పాయ్ బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేయకుండా కొన్నాళ్లకే మనోజ్ బాజ్‌పాయ్‌తో ప్రేమలో పడి తనను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ అయిపోయింది. ఒకప్పుడు తను చేసిన సినిమాల ద్వారానే తనను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు.