Kangana Ranaut: మామూలుగా సినీ పరిశ్రమలో భాగమయిన ఎవ్వరైనా ఓపెన్‌గా చేసే పలు కామెంట్స్ వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే చాలావరకు తమ మనసులోని మాటలను బయట పెట్టాలని అనుకోరు. కొందరు మాత్రమే ఏ మాత్రం ఆలోచించకుండా, భయపడకుండా, బోల్డ్‌గా మాట్లాడేస్తుంటారు. అలాంటి వారిలో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. బాలీవుడ్ నటీనటుల్లో కంగనా లాగా ఎవరూ ఉండలేరు, ఎవరూ మాట్లాడలేరు అని తన ఫ్యాన్స్ అంటుంటారు. తాజాగా మరొకసారి కంగనా రనౌత్ ఓపెన్‌గా, బోల్డ్‌గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి తన సినిమాపై తానే నెగిటివ్ కామెంట్స్ చేసుకొని ఒక కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
దర్శకురాలిగా ప్రయోగం
చాలావరకు హీరోయిన్స్.. నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ దర్శకులుగా మైక్రో ఫోన్ పట్టుకున్నవారు, అందులో సక్సెస్ అందుకున్నవారి సంఖ్య చాలా తక్కువ. అలా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇప్పటికే దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొని, తన టాలెంట్ ఏంటో ప్రేక్షకులకు చూపించింది. ‘మణికర్ణిక’ అనే భారీ బడ్జెట్ సినిమాకు దర్శకురాలిగా మొదటిసారి బాధ్యతలు తీసుకొని అందులో కూడా తన బెస్ట్ అని నిరూపించుకోవాలని అనుకుంది. ఇప్పుడు ఇందిరా గాంధీ బయోపిక్‌గా తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ని కూడా తానే డైరెక్ట్ చేసింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కంగనా మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Also Read: సమంత చివరి జ్ఞాపకాలను కూడా చెరిపేసిన శోభిత.. ఏం చేసిందంటే..?
తప్పుడు నిర్ణయాలు
‘‘ఎమర్జెన్సీ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలి అన్నది నా తప్పుడు నిర్ణయం. నాకు ఓటీటీలో అయ్యింటే బెటర్ డీల్ వచ్చేది. ఈ సెన్సార్‌షిప్‌లాంటి కష్టాలు ఉండేవి కాదు. ఇప్పుడు నా సినిమాను ముక్కలు ముక్కలు చేస్తారు. సెన్సార్ వాళ్లు ఏది ఉంచుతారో, ఏది తీసేస్తారో ఆ దేవుడికే తెలియాలి’’ అని ‘ఎమర్జెన్సీ’ సెన్సార్ గురించి వాపోయింది కంగనా రనౌత్. ‘‘నేను చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ముందుగా ఈ సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకోవడం నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం’’ అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ఈజీ అనుకున్నాను
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం వల్ల ఇందిరా గాంధీపై సినిమా తీసి ఈజీగా రిలీజ్ చేయొచ్చు అనుకున్నాను కానీ అలా జరగలేదు. పొలిటికల్ సినిమాలను డైరెక్ట్ చేసే తప్పు మళ్లీ ఎప్పుడూ చేయను. ఇలాంటి ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను హ్యాండిల్ చేయడం ఎంత కష్టమో నాకు అప్పుడు తెలియలేదు. భవిష్యత్తులో పొలిటికల్ సినిమాను నేనెప్పుడూ డైరెక్ట్ చేయను’’ అంటూ కఠిన నిర్ణయం తీసుకుంది కంగనా రనౌత్. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ కాంట్రవర్సీల వల్ల 2024 సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన ‘ఎమర్జెన్సీ’ (Emergency).. 2025 జనవరి 17న విడుదల కానుంది. అయినా ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పనులు పూర్తి కాలేదు. దీంతో జనవరిలో అయినా ఈ మూవీ విడుదల అవుతుందా అని అందరిలో సందేహం మొదలయ్యింది.