BigTV English

Aloo Bukhara Fruits: ఈ ఒక్క పండు చాలు.. క్యాన్సర్ నుంచి గుండె జబ్బుల వరకు అన్నింటికి చెక్..!

Aloo Bukhara Fruits: ఈ ఒక్క పండు చాలు.. క్యాన్సర్ నుంచి గుండె జబ్బుల వరకు అన్నింటికి చెక్..!

Aloo Bukhara Fruits: మీ ఆహారంలో పండ్లు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ప్లం ఫ్రూట్ దీనిని ఆల్ బుఖారా పండ్లు అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్లం పండ్లు వివిధ రంగులలో, పరిమాణాలలో లభిస్తాయి. వీటిలో ముఖ్యంగా ఎరుపు, ఊదా, నల్ల రంగులు ఉంటాయి. ప్లం పండ్లు అనేక పోషక విలువలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ ఎ, ఫైబర్, అధికంగా ఉంటుంది.


ప్లం ఫూట్ర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు:

ప్లం పండులోని పోషకాలు:
ఈ పండు ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, బి, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇనుము, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండు తినడం వల్ల దీనిలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగు డయాబెటిస్ ను తగ్గిస్తుంది.


గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
ఈ ప్లమ్ లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు మరియు వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడతాయి. ప్లమ్‌లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, గుండెపోటు రిస్క్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ప్లమ్‌లోని విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం ఎముకల బలాన్ని పెంచుతాయి. ఎండిన ప్లమ్‌లు ఆస్టియోపోరోసిస్‌ను నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

బరువును తగ్గిస్తుంది:
తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల ప్లమ్‌లు బరువు తగ్గించే ఆహారంలో చేర్చుకోవడానికి అనుకూలం.ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది, దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. ప్లమ్‌లోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనిలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి, ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరం.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి, ఇది చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు సూర్యరశ్మి లేదా కాలుష్యం వల్ల కలిగే చర్మ నష్టాన్ని తగ్గిస్తాయి.

Also Read: ఫేస్ క్రీమ్స్‌కు ఇక గుడ్ బై.. ఈ ప్యాక్స్‌తో మెరిసే ముఖ్యం మీ సొంతం

కంటి ఆరోగ్యం:
ఈ పండులో ఉండే విటమిన్ ఎ, బీటా-కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి, వయసు సంబంధిత కంటి సమస్యలను నివారిస్తాయి. ప్లమ్‌లోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తాయి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్లమ్‌లోని బి-విటమిన్లు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

ఈ పండును మీ రోజూ వారి ఆహారంలో బాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.  అయితే మితంగా తీసుకోవడం మంచిదంటున్నారు.

Related News

Makhana: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !

Stress: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Big Stories

×