OTT Movie : ఈ రోజుల్లో కార్పొరేట్ విద్యావ్యవస్థ ఎలా నడుస్తుందో అందరికీ తెలిసిందే. కేవలం డబ్బు, ర్యాంకులకే పరిమితం అవుతోంది. ర్యాంకుల కోసం పోటీ పడలేక పిల్లలు ఆత్మ హత్యలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా దీనికి భిన్నంగా వచ్చింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్, ఒక మంచి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విద్యను కొత్త తరహాలో బోధించే ప్రయత్నం చేశాడు. మహేష్ బాబు కూడా ఈ సినిమాను చూసి చాలా బాగుందని ప్రశంసించాడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
ఈ టివి విన్ (ETV Win)
ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘అనగనగా’ (Anaganaga). దీనికి సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సుమంత్ (వ్యాస్), కాజల్ చౌదరి (భాగ్యలక్ష్మి), మాస్టర్ విహర్ష్ (రామ్), శ్రీనివాస్ అవసరాల, అను హాసన్, రాకేష్ రాచకొండ ప్రధాన పాత్రలలో నటించారు. 2025 మే 15న ఈ టివి విన్ (ETV Win) OTT ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా విడుదలైంది. తొమ్మిది ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది విద్యా వ్యవస్థలోని లోపాలు, తండ్రి-కొడుకు బంధం, కథల ద్వారా టీచింగ్ అనే థీమ్‌లను చూపిస్తుంది. ఈ సినిమాకు IMDB లో 8.2/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
వ్యాస్ (సుమంత్) ఒక స్కూల్ టీచర్ గా, సాంప్రదాయ బోధనా పద్ధతులను వ్యతిరేకించి, కథల ద్వారా విద్యను అందించే ప్రయత్నం చేస్తుంటాడు. అతను మార్కులు, ర్యాంకుల కంటే విద్యార్థులలో ఆలోచనా సామర్థ్యంను పెంచడానికి కథల ద్వారా విద్యను బోధిస్తుంటాడు. అతని భార్య భాగ్యలక్ష్మి (కాజల్ చౌదరి), ఒక కార్పొరేట్ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఉంటూ, మార్కులు, ఫలితాలపై దృష్టి పెట్టే సాంప్రదాయ విద్యా విధానాన్ని సమర్థిస్తుంటుంది. ఈ భిన్నమైన మనస్తత్వంతో, వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితాలలో వీళ్ళిద్దరూ ఇబ్బందులు పడతారు. వ్యాస్, భాగ్యలక్ష్మి కొడుకు రామ్ (మాస్టర్ విహర్ష్) మాత్రం స్కూల్‌లో చదువులో వెనుకబడతాడు. వ్యాస్ బోధనా విధానం వల్ల, రామ్ తో పాటు ఇతర విద్యార్థులు పరీక్షలలో వెనకబడతారు. స్కూల్ మేనేజ్‌మెంట్ దీనికి వ్యాస్ ను బాధ్యుడిగా చేసి , అతన్ని ఉద్యోగం నుండి తొలగిస్తుంది. ఈ అవమానం వ్యాస్‌ను తీవ్రంగా కలిచివేస్తుంది.
కానీ అతను తన ఆదర్శాలను వదులుకోకుండా, స్వంత స్కూల్‌ను స్థాపించాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ అతను తన కథల ద్వారా, బోధనా పద్ధతులను అమలు చేయాలనుకుంటాడు. ఈ ప్రయాణంలో అతను ఆర్థిక సమస్యలు వస్తాయి. భాగ్యలక్ష్మి నుండి కూడా కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ఆమె మొదట్లో తన కొడుకు కోసం సాంప్రదాయ విద్యను సమర్థిస్తుంది. ఆ తరువాత మనసు మార్చుకుంటుంది. ఈ సమయంలో, వ్యాస్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. ఇది అతని పోరాటానికి అడ్డుగా నిలుస్తుంది. అతని ఆరోగ్య సమస్య అతని కుటుంబంపై, ముఖ్యంగా భాగ్యలక్ష్మి, రామ్‌పై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇక క్లైమాక్స్ ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. చివరికి వ్యాస్ టీచింగ్ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ? అతను సొంతంగా స్కూల్ ని రన్ చస్తాడా ? వ్యాస్ కి క్యాన్సర్ నయం అవుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : పేరెంట్స్ ను కాదని వేరొకరికి కూతురు దత్తత… పోలీస్ ఆఫీసర్ తో ఆటలా? హార్ట్ టచింగ్ మలయాళం మూవీ