BigTV English

Alcohol: మద్యం సేవిస్తూ.. స్టఫ్ తింటున్నారా? అయ్యయ్యో..

Alcohol: మద్యం సేవిస్తూ.. స్టఫ్ తింటున్నారా? అయ్యయ్యో..

Alcohol: మద్యం తాగడం అనేది ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. వీకెండ్ పార్టీలంటూ, పబ్ లంటూ.. ఇలా యువత రకరాలుగా పార్టీలు చేసుకుంటున్నారు. ఇది తర్వాత వ్యసనంగా మారిపోతుంది. ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే మద్యం తాగేవారు కానీ.. ప్రస్తుతం అమ్యాయిలు కూడా తాగడం మొదలు పెట్టారు. అయితే చాలా మంది మద్యం సేవించే సమయంలో మందు చేదుగా ఉంటుందని దానిలోకి స్టఫ్ తీసుకుంటారు. అది లేకుంటే అస్సులు తగ్గరు.. కిక్కుకు కిక్కు.. హెల్తుకి హెల్తు అని స్టఫ్ కూడా పక్క కావాలి అంటారు. కానీ మద్యం, స్టఫ్ కలిపి తీసుకోవడం వల్ల కలిగే శారీరక, మానసికంగా, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా మద్యం తాగడం వల్ల శరీరంలోని అనేక వ్యవస్థలు దెబ్బతింటాయి.


మద్యం, స్టఫ్ కలిపి తీసుకోవడం వల్ల కలిగే అనార్థాలు

మద్యం సేవించేటప్పుడు స్టఫ్ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. అంతేకాకుండా మద్యం కాలేయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. స్టఫ్ తినడం ద్వారా ఈ ఒత్తిడి మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఇది యాసిడ్ రిప్లక్స్‌కు కారణమవుతుంది. దీంతో గుండెల్లో మంట సమస్యలను కలిగిస్తుంది.


మద్యం వల్ల కలిగే సమస్యలు

శారీరక ఆరోగ్య సమస్యలు
కాలేయం సమస్యలు: మద్యం కాలేయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది, ఇది ఫ్యాటీ లివర్, హెపటైటిస్, సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది.
జీర్ణ వ్యవస్థ: గ్యాస్ట్రైటిస్, ప్యాంక్రియాటైటిస్, అల్సర్లు, గొంతు, కడుపు క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
హృదయ సంబంధ సమస్యలు: అధిక రక్తపోటు, కార్డియోమయోపతి, గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
నాడీ వ్యవస్థ: స్మృతి నష్టం, నరముల దెబ్బతినడం, మెదడు కణజాలం దెబ్బతినడం వంటివి జరుగుతాయి.
రోగ నిరోధక శక్తి: అలాగే రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి అనేక రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.
పునరుత్పత్తి వ్యవస్థ: పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం, స్త్రీలలో ఋతు చక్రం అసమతుల్యత, గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మానసిక ఆరోగ్య సమస్యలు
ఆందోళన మరియు డిప్రెషన్: మద్యం మానసిక స్థితిని అస్థిరపరుస్తుంది, ఆందోళన, డిప్రెషన్‌ను పెంచుతుంది.
అడిక్షన్: మద్యంపై ఆధారపడటం వల్ల మానసికంగా బలహీనతను కలిగిస్తుంది. దీర్ఘకాల వినియోగం వల్ల ఆల్కహాలిక్ డిమెన్షియా లేదా హెలుసినేషన్స్ ఏర్పడవచ్చు. అలాగే
మత్తు, శక్తి తగ్గడం, సమన్వయ లోపం, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా మద్యం విషప్రయోగం కోమా లేదా మరణానికి దారితీస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×