BigTV English

Corn Flour Face Pack: కార్న్ ఫ్లోర్‌లో ఈ ఒక్కటి కలిపి వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం

Corn Flour Face Pack: కార్న్ ఫ్లోర్‌లో ఈ ఒక్కటి కలిపి వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం

Corn Flour Face Pack: చలికాలంలో చర్మం చాలా డల్‌గా మారుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సీజన్‌లో తమ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీని కోసం కొందరు ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. అంతే కాకుండా చాలా మంది హోం రెమెడీస్ వాడుతుంటారు. చలికాలంలో చర్మ సంరక్షణకు కార్న్ ఫ్లోర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి గ్లోయింగ్ స్కిన్ కోసం కార్న్ ఫ్లోర్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


మొక్కజొన్న పిండితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు పోషణను కూడా అందిస్తుంది. మొక్కజొన్న పిండిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు , యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

వాస్తవానికి, మొక్కజొన్న పిండిలో సమృద్ధిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషించడంలో , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.


చర్మం మెరుస్తుంది:
మొక్కజొన్న పిండి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారానికి రెండు మూడు సార్లు కార్న్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్ వాడితే ముఖం మెరిసిపోతుంది.

మృత కణాలను తొలగిస్తుంది:
మొక్కజొన్న పిండి స్క్రబ్ లాగా పనిచేస్తుంది. అంతే కాకుండా మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు కార్న్ ఫ్లోర్‌తో తయారు చేసిన స్క్రబ్‌ ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ముడతలను తగ్గిస్తుంది:

కార్న్ ఫ్లోర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. చర్మంపై ఉండే ముడతలు తగ్గాలంటే కార్న్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్ వాడాలి. దీని ఉపయోగించడం వల్ల పిగ్మెంటేషన్ తో పాటు టానింగ్‌ సమస్య తగ్గిపోతుంది.

కార్న్ ఫ్లోర్‌తో ఫేస్ ప్యాక్ తయారీ..
కావలసినవి:

కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
పాలు – 2-3 టేబుల్ స్పూన్లు
తేనె – 1 టీస్పూన్
రోజ్ వాటర్ – 1-2 టీస్పూన్లు

తయారీ విధానం:

కార్న్ ఫ్లోర్‌తో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా కార్న్ ఫ్లోర్‌ను పైన చెప్పిన మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చి పాలు వేసి బాగా కలపాలి. దీని తరువాత తేనె, రోజ్ వాటర్ కలపండి. ఇప్పుడు ఇది మందపాటి పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ పేస్ట్‌ని మీ ముఖం, మెడపై అప్లై చేయండి. ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్క్రబ్ చేయడం ద్వారా మీ ముఖాన్ని వాష్ చేయండి.

Also Read: ఇలా చేశారంటే.. తెల్లజుట్టు రమ్మన్నా రాదు

ప్యాక్‌ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి:

ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. దీనిని ఉపయోగించేటప్పుడు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీ చర్మం సున్నితంగా ఉంటే, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ని కళ్లు, పెదవుల చుట్టూ అప్లై చేయకండి. కొన్నిసార్లు ఇది కళ్ళ లోపలికి వెళుతుంది. ఫలితంగా కొన్ని రకాల సమస్యలను కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Wrinkles: చిన్న వయస్సులోనే.. ముఖంపై ముడతలా ? ఈ టిప్స్ పాటించండి !

Bald head: పురుషుల్లో బట్టతల రావడానికి.. అసలు కారణాలివేనట !

Vitamin C: వీటిలో.. విటమిన్ సి పుష్కలం !

Guava: వీళ్లు.. పొరపాటున కూడా జామపండ్లు తినొద్దు !

Best Tips For Skin: అందంగా కనిపించాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి !

Breakfast: ఉదయం పూట.. ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తినాలో తెలుసా ?

Big Stories

×