Hearth Healt CAD| గుండె ఆరోగ్యంగా ఉంటనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరమంతా రక్తాన్ని సరఫరా చేస్తూ.. రక్తాన్ని శుద్ధి చేస్తూ.. నిరంతరం శరీరంలోని అన్ని భాగాలకు శక్తినిచ్చే గుండెకు అనారోగ్యం చేస్తే.. అప్పుడు ప్రాణం పోయే ప్రమాదముంది. అందుకే గుండె ఆరోగ్యం అత్యంత కీలకం. గుండె ఆరోగ్యం అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తే, మరికొన్ని అంత సులభంగా తెలియవు. గుండె జబ్బులలో ఎక్కువగా బయటపడని ఒక సమస్య కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD). క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కొలెస్ట్రాల్ పరీక్షలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయని చాలామంది భావిస్తారు. కానీ, గుండె జబ్బులకు కొలెస్ట్రాల్ మాత్రమే కారణం కాదని చాలామందికి తెలియదు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. భారతదేశంలోని పట్టణాలు, నగరాల్లో జీవించేవారిలో గుండె జబ్బులతో బాధపడేవారు.. 7 శాతం నుండి 13 శాతం ఉన్నారు. CADకు కారణమయ్యే వివిధ అంశాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారించడం మరియు నిర్వహించడం సులభమవుతుంది.
కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD) అంటే ఏమిటి?
మణిపాల్ హాస్పిటల్, గురుగ్రామ్‌లో కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీ విభాగం చీఫ్, డాక్టర్ జతిన్ యాదవ్ వివరిస్తూ.. కరోనరీ ఆర్టరీ డిసీజ్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను ప్రభావితం చేసే సాధారణ జబ్బు అని చెప్పారు. ఈ రక్తనాళాలలో ప్లాక్ (కొవ్వు పదార్థం) పేరుకుపోవడం వల్ల అవి అడ్డుకుంటాయి. దీని వల్ల గుండెపోటు.. గుండె లయ అసాధారణంగా ఉండడం లేదా గుండె వైఫల్యం వంటివి సంభవించవచ్చు. కరోనరీ ఆర్టరీ డిసీజ్ ప్రధాన లక్షణం ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం, ఇది కొంత సమయం వచ్చి పోతూ ఉంటుంది. శారీరక శ్రమ లేదా భావోద్వేగ సందర్భాలలో ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. కొందరికి ఊపిరి ఆడకపోవడం.. త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి, చిన్న పనులు చేసినా సరే అలసట కలుగుతుంది.
కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నట్లు ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే దీన్ని గుర్తించేందుకు శరీరంలో వార్నింగ్ సైన్స్ ని గమనించాలి.కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ను తరచూ “సైలెంట్ కిల్లర్” అంటారు. ఎందుకంటే ఇది సంవత్సరాలపాటు గుర్తించబడకుండా ఉండవచ్చు. కొలెస్ట్రాల్ మాత్రమే దీనికి కారణం కాదు.
ఇతర ముఖ్య కారణాలు ఇవే..
Also Read: మష్రూమ్స్ తింటున్నారా? జాగ్రత్త.. పుట్టగొడుగులు తిని ఆరుగురు మృతి
నివారణ, చికిత్స
రక్తనాళాల్లో ఎక్కువగా అడ్డంకలు ఉన్నప్పుడు అడ్డుకున్నప్పుడు. రక్త ప్రవాహం తీవ్రంగా తగ్గుతుంది, ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) సర్జరీ వంటి చికిత్సలు అవసరం కావచ్చు. ఈ సర్జరీ అడ్డుకున్న రక్తనాళం చుట్టూ రక్తం ప్రవహించడానికి కొత్త మార్గాన్ని సృష్టిస్తుంది. గుండె జబ్బుల నివారణకు కొలెస్ట్రాల్‌ను మాత్రమే చూడకుండా.. ఇతర కారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు, ఒత్తిడి నిర్వహణ ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచవచ్చు.