TV Anchor Swecha Suicide: ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. రాంనగర్‌లోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు. ఓ న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు స్వేచ్ఛ. అయితే ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆమె మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు.
అయితే తన కూతురు ఆత్మహత్యకు పూర్ణచంద్రరావే కారణమని చెప్పారు స్వేచ్చ తండ్రి. భర్తతో స్వేఛ్చ విడిపోయాక.. పూర్ణచంద్రరావుతో కలిసి ఉంటుందని తెలిపారు. అయితే కొన్నాళ్లుగా వీళ్లద్దరి మధ్య గొడవలు ఉన్నాయని.. ఆ కారణంతోనే తన కూతరు ఆత్మహత్యకు పాల్పడిందని స్వేచ్చ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచంద్రరావుపై చిక్కడపల్లి పీఎస్‌లో ఫిర్యాదుచేశారు.
ప్రముఖ టీవీ యాంకర్ స్వేఛ్చ ఆత్మహత్య చేసుకోవడంతో.. మీడియా రంగంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ ఘటన గురువారం రాత్రి హైదరాబాదులోని ఆమె నివాసంలో జరిగింది. కుటుంబ సభ్యులు అనుమానంతో తలుపులు తట్టగా, స్వేఛ్చ అప్పటికే ఉరేసుకొని ప్రాణాలు విడిచినట్టు గుర్తించారు.
స్వేఛ్చ ఇటీవల కొన్ని ప్రముఖ టీవీ చానళ్లలో యాంకర్‌గా పనిచేశారు. ఆమె ప్రసార శైలి, ముక్తంగా మాట్లాడే తీరు, అభివ్యక్తి శైలి చాలా మందికి ఆకర్షణీయంగా నిలిచారు. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సామాజిక అంశాలపై.. చురుకుగా స్పందించే వ్యక్తిగా పేరుగాంచారు. టీవీ9 ఛానల్ లో పాపులర్ అయిన స్వేచ్ఛ ప్రస్తుతం TNEWS లో తన సేవలు కొనసాగిస్తున్నారు. TUWJ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.
Also Read: ఆ బిజినెస్ మ్యాన్ ప్రాణాలు కాపాడలేకపోయిన 1.5 కోట్ల కారు, స్పాట్ లోనే..
అయితే గత కొన్ని నెలలుగా ఆమె మనసిక పరిస్థితి క్షీణించినట్లు.. ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వ్యక్తిగత జీవితం, పని ఒత్తిడి ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టినట్లు ప్రాథమిక సమాచారం. స్వేఛ్చ రాసిన సూసైడ్ నోట్ ఒకటి పోలీసులకు లభించినట్టు తెలుస్తోంది. అందులో తన మానసిక పరిస్థితిని వివరిస్తూ, బాధలను ఎవరికీ చెప్పుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.