E-Paper
Advertisement

నోరూరించే క్రిస్పీ వంకాయ వేపుడు..ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే!

నోరూరించే క్రిస్పీ వంకాయ వేపుడు..ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే!
Advertisement

Crispy vankaya fry recipe: మన వంటకాల్లో వంకాయకు ప్రత్యేక స్థానం ఉంది. వంకాయ కూర అంటే.. మొహం చాటేసే పిల్లలు కూడా ఈ క్రిస్పీ వేపుడు ముందుంటే.. ప్లేట్ మొత్తం ఇట్టే ఖాళీ చేసేస్తారు. సరైన పద్ధతిలో, తక్కువ మసాలాలతో, కమ్మటి సువాసన వచ్చేలా.. ఈ వంకాయ ఫ్రై చేస్తే దాని రుచి అద్దిరిపోతుంది. సాంబార్, రసం లేదా పప్పు అన్నంలోకి.. ఇది నంజుకోవడానికి నంబర్ వన్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఇంతకీ ఈ టేస్టీ క్రిస్పీ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందమా..

కావలసిన పదార్థాలు:

గుండ్రని లేదా పొడవుగా తరిగిన వంకాయ ముక్కలు -3 కప్పులు

Advertisement

పల్లీలు (వేరుశనగ గుళ్లు)-3 స్పూన్లు

ఎండుమిర్చి – 4 లేదా 5

Advertisement

వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 8

ధనియాల పొడి – 1 స్పూన్

పసుపు – చిటికెడు

కారం – రుచికి సరిపడా

ఉప్పు – తగినంత

కరివేపాకు – రెండు రెమ్మలు

నూనె – సరిపడా

తయారీ విధానం :

1.మొదటగా వంకాయలను శుభ్రంగా కడిగి, సన్నని పొడవుగా లేదా ముక్కలుగా తరిగి నీటిలో.. ఉంచుకోవాలి. వంకాయలు నల్లగా.. మారకుండా ఉండటానికి కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో.. నాన బెట్టడం మంచిది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన.. తర్వాత తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి మీడియం మంటపై.. దోరగా వేయించాలి. వంకాయ ముక్కలు మెత్తబడి, రంగు మారేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి.

2.ఈ వంకాయ వేపుడు అసలైన రుచి రావడానికి ఒక చిన్న సీక్రెట్ మసాలా ఉంది. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని వేయించుకున్న వంకాయ ముక్కలలో కలపడమే..ఈ రెసిపీ మెయిన్ హైలైట్.

Also Read: నోరూరించే రుచితో క్యాబేజీ రోటి పచ్చడి..క్షణాల్లోనే రెడీ అవుతుంది!

3. వంకాయ ముక్కలు సగం పైగా వేగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న.. పల్లీ-వెల్లుల్లి పొడిని అందులో వేయాలి. దీనికి తగినంత కారం, పసుపు, ధనియాల పొడి, రుచికి సరి పడా ఉప్పు వేసి బాగా కలపాలి. మంటను చిన్నగా ఉంచి, మసాలా వాసన పోయి, వంకాయ ముక్కలు క్రిస్పీగా మారే.. వరకు మరో ఐదు నిమిషాలు వేయించాలి. చివరగా గుమ గుమలాడే కరివేపాకు రెమ్మలను పైన చల్లి దించేయాలి. అంతే..ఎంతో రుచికరమైన క్రిస్పీ వంకాయ వేపుడు సిద్ధం!

వేడి వేడి అన్నంలో ఈ వంకాయ వేపుడు వేసుకొని, పక్కన నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. ఎంతో ఈజీగా, తక్కువ టైంలో తయారయ్యే ఈ వంకాయ ఫ్రైని మీరు కూడా.. మీ ఇంట్లో ట్రై చేసి మీ కుటుంబ సభ్యులకు వడ్డించండి. “ఆహా, అద్భుతం!” అనే అందరూ మెచ్చుకుంటారు!

Related News

Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి రోజున ఈ శుభ సమయంలో దీపం వెలిగిస్తే సకల శుభాలు మీవే!

విలేజ్ స్టైల్ ఎండు నేతళ్ళు కోడిగుడ్ల కూర..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

నోరూరించే రుచితో క్యాబేజీ రోటి పచ్చడి..క్షణాల్లోనే రెడీ అవుతుంది!

ప్రేమ వద్దు కానీ నీతోడు కావాలి.. జెన్ Z కొత్త ట్రెండ్

పెళ్లిళ్లు, పార్టీలు, ఎయిర్‌పోర్టులలో ఇవి తినకూడదు.. ఢాక్టర్ హెచ్చరిక

ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తున్నారా? ఈ అలవాటు మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోందంటే?

మీ ఆత్మీయులే మిమ్మల్ని మోసం చేస్తే ఏం చేయాలి? మహాభారతంలో విదురడు చెప్పిన నీతి

Big Stories

Advertisement
×