Endu nethallu egg curry: మన తెలుగు రాష్ట్రాల్లో.. నాన్-వెజ్ వంటకాల్లో నాటు రుచులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా వర్షా కాలంలో లేదా చలి కాలంలో వేడి వేడి అన్నంలోకి ఘాటుగా ఉండే చేపల కూర లేదా ఎండు చేపల కర్రీ తింటే ఆ మజాయే వేరు. సాధారణంగా.. ఎండు చేపలతో రకరకాల కూరలు చేసుకుంటాం. కానీ అందులో ..కోడిగుడ్లను చేర్చి వండితే.. ఆ రుచి అదిరిపోతుంది. ఎండు నేతళ్ళు , కోడిగుడ్ల కాంబినేషన్ కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంతకీ ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..
ఎండు నేతళ్ళు – 1 కప్పు
ఉడికించిన కోడిగుడ్లు – 4 లేదా 5
ఉల్లిపాయలు – 2
పచ్చి మిరపకాయలు – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
టమాటోలు – 2
కారం – రుచికి సరిపడా
పసుపు – చిటికెడు
ధనియాల పొడి – 1.5 స్పూన్
చింతపండు గుజ్జు – చిన్న నిమ్మకాయ సైజ్ అంత
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
1.మొదటగా.. ఎండు నేతళ్లను శుభ్రంగా కడగాలి. ఎండు చేపలపై.. ఉండే దుమ్ము ధూళి పోయేందుకు గోరు వెచ్చని నీటిలో.. ఒక ఐదు నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత మంచి నీటితో.. రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కోడి గుడ్లకు చిన్నగా గాట్లు పెట్టి, కొద్దిగా పసుపు, కారం పట్టించి ప్యాన్ లో నూనె వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టి.. తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు వేసి బంగారు రంగు వచ్చేంత.. వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు తరిగిన.. టమాటా ముక్కలు వేసి, టమాటాలు మెత్తగా మగ్గి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
2.టమాటోలు బాగా మగ్గిన తర్వాత ముందుగా.. శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నేతళ్లను అందులో వేయాలి. మసాలా పట్టేలా రెండు నిమిషాలు బాగా కదిలించాలి. ఆ తర్వాత రుచికి సరి పడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. మసాలాలు మాడిపోకుండా చిన్న మంటపై కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా రెడీ.. చేసుకున్న చింతపండు గుజ్జును, కూరకు తగినన్ని నీళ్లను పోయాలి. గ్రేవీ కొద్దిగా చిక్కబడే వరకు మూతపెట్టి ఉడికించాలి. కూర ఉడికే సమయంలో ..ముందుగా వేయించి పెట్టుకున్న కోడి గుడ్లను అందులో వేయాలి. కోడి గుడ్లకు మసాలా బాగా పట్టేలా.. మరో ఐదు నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. చివరగా.. గుమఘుమలాడే కొత్తి మీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే..ఘుమఘుమలాడే ఎండు నేతళ్ళు కోడిగుడ్లు కూర రెడీ!
Also Read: ఏడాది నిల్వ ఉండే.. పండు మిరపకాయ పచ్చడి పక్కా కొలతలతో!
వేడి వేడి అన్నంలో ఈ ఎండు నేతళ్ళు కోడిగుడ్ల కర్రీ వేసుకొని తింటుంటే ఆ రుచి మాటల్లో వర్ణించలేం. నోటికి రుచిగా, కారకారంగా ఉండే ఈ పల్లెటూరు స్టైల్ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులు అందరూ “చాలా బాగుంది” అని కచ్చితంగా మెచ్చుకుంటారు!