AP Cyclone: ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాకు మరో భారీ ‘తుపాను’ ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాగల 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రంలో భారీగా అల్పపీడనం ఎర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో బీకర వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అయితే ఈ నెల 15 నాటికి ఈ తుఫాను ‘వాయుగుండం’గా బలపడే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. వాయుగుండంగా ఏర్పిన తరువాత ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంద్ర మధ్య తీరాన్ని తాకుతూ దీనికి తోడు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలిస్తే తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పుల కారణంగా ఇది వేగంగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మోదటగా ఇది అల్పపీడనంగా మొదలైనప్పటికీ రానున్న రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత మరో భారీ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఏపీలో ఆర్నబ్ తుఫాన్ తో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. భారీగా పంటలు, పండ్లతోటలు, మత్సకారులు తీవ్రంగా నష్టపోయారు.
Also Read: డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు