E-Paper
Advertisement

మీ ఆత్మీయులే మిమ్మల్ని మోసం చేస్తే ఏం చేయాలి? మహాభారతంలో విదురడు చెప్పిన నీతి

మీ ఆత్మీయులే మిమ్మల్ని మోసం చేస్తే ఏం చేయాలి? మహాభారతంలో విదురడు చెప్పిన నీతి
Advertisement

Loved Ones Betray You| మన కష్టసుఖాల్లో తోడుంటారని మనం ఎక్కువగా నమ్మేది మన ఆత్మీయులైన కుటుంబ సభ్యులు, స్నేహితులనే. వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. కానీ కొన్నిసార్లు మనం ప్రాణంగా నమ్మినవారే మన జీవితంలో సమస్యలకు కారణమవుతారు. వారి చెడు అలవాట్లు మన కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తాయి. అందుకే ఎదుటివారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మహాత్మా విదురుడు తన నీతుల్లో మనుషుల స్వభావం, సంబంధాలు, ప్రవర్తన గురించి ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. మరి విదుర నీతి ప్రకారం మనవాళ్లే మన పతనానికి కారణమయ్యే మూడు పరిస్థితులేంటో తెలుసుకుందాం.

1. కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తులతో జాగ్రత్త

కోపం మనిషి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ సమయంలో ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో, ఎలాంటి పనులు చేస్తున్నారో కూడా ఆలోచించలేరు. ఒక్కోసారి ఆవేశంలో మాట్లాడే మాటలు ఇతరుల మనసు తీవ్రంగా గాయపరుస్తాయి.
కోపంతో ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులతో కూడా గొడవలకు దిగవచ్చు. కొన్నిసార్లు వారి ప్రవర్తన ఇతరులకు పెద్ద సమస్యలను తీసుకురావచ్చు. అందుకే కోపంలో ఉన్నవారితో అనవసరమైన వాదనలకు దిగకూడదు. వారు శాంతించే వరకు కొంత దూరంగా ఉండటం మంచిది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సంబంధాలను దెబ్బతీయకుండా జాగ్రత్తపడాలి.

2. అత్యాశ ఉన్నవారికి దూరంగా ఉండాలి

Advertisement

అత్యాశ.. మనిషి ఆలోచనలను, ప్రవర్తనను మార్చేస్తుంది. అలాంటి వ్యక్తులు బంధుత్వాల కంటే డబ్బు, ఆస్తి, వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విదుర నీతి ప్రకారం అత్యాశ ఉన్న వ్యక్తి తన స్వార్థం కోసం ఆత్మీయులను కూడా ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. డబ్బు లేదా ఆస్తి విషయంలో ఇతరుల భావాలను పట్టించుకోకపోవచ్చు. తమ ప్రయోజనాల కోసం ఎదుటివారి నమ్మకాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి ప్రవర్తన కుటుంబంలో ఆర్థిక సమస్యలకు, గొడవలకు కారణమవుతుంది. అందుకే డబ్బు, ఆస్తి వంటి విషయాల్లో గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

Also Read: మనసులో ఒకటి, మెదడులో మరొకటి.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ నిర్ణయాల్లో తడబడుతుంటారు

3. చెడు స్నేహాలతో జీవితాలు నాశనం

Advertisement

మనిషి ఎవరితో స్నేహం చేస్తున్నాడనే విషయం అతని ఆలోచనలు, అలవాట్లు, నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది. మంచి స్నేహితులు మంచి మార్గంలో నడిపిస్తారు. చెడు స్నేహాలు మాత్రం తప్పుడు అలవాట్లకు దారితీయవచ్చు. కొంతమంది చెడు స్నేహాల ప్రభావంతో కుటుంబ సభ్యుల మాటలను పట్టించుకోరు. ఇతరుల మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితంగా వారి కుటుంబం కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
విదుర నీతి ప్రకారం.. మనిషి సాంగత్యం చాలా ముఖ్యమైనది. అందుకే మన ఆత్మీయులు ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నారో గమనించాలి. వారి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే ప్రేమగా అర్థమయ్యేలా చెప్పాలి.

Also Read: కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు మంచి అవకాశం వచ్చినా సంకోచిస్తారు

విదుర నీతి మనకు నేర్పే జీవిత పాఠం ఇదే!

ప్రతి బంధంలో నమ్మకం, గౌరవం, పరస్పర అవగాహన ఉండాలి. అయితే గుడ్డిగా నమ్మడం వల్ల కొన్నిసార్లు ఇతరుల చెడు ప్రవర్తనను గుర్తించలేకపోవచ్చు. అందుకే మాటలకంటే చేతలను గమనించాలి. మనశ్శాంతికి భంగం కలిగించే ప్రవర్తనకు తగిన హద్దులు పెట్టుకోవాలి.

Related News

మీరు వివాహం చేసుకున్న వ్యక్తి ధైర్యవంతుడా లేక పిరికివాడా? ఈ 5 లక్షణాలు చూసి తెలుసుకోండి

చిన్న వయసులోనే పెద్ద పెద్ద మాటలు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు ఎంతో పరిణతితో ఆలోచిస్తారు

30 ఏళ్ల వయసులోనే తెల్ల జుట్టు.. హెయిర్ కలర్ ఎన్నిసార్లు వేయాలి.. ఈ జాగ్రత్తలు పాటించండి

భారీ పెరిగిన పాల ధరలు.. అయినా నో టెన్షన్.. తక్కువ ఖర్చుతో పోషకాలు ఇచ్చే 7 ఫుడ్స్ ఇవిగో

1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

పెసరపప్పుతో నమక్‌పారా.. ఇలా చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా అదిరిపోద్ది!

ఎప్పుడూ పకోడీలు, బజ్జీలేనా? ఈసారి ఇలా అటుకుల బొండాలు చేసుకుని తిని చూడండి!

Big Stories

Advertisement
×