E-Paper
Advertisement

ప్రేమ వద్దు కానీ నీతోడు కావాలి.. జెన్ Z కొత్త ట్రెండ్

ప్రేమ వద్దు కానీ నీతోడు కావాలి.. జెన్ Z కొత్త ట్రెండ్
Advertisement

FriendCrush| కొంతమందిని చూడగానే వారితో మాట్లాడాలని అనిపిస్తుంది. వారి మాటతీరు, నవ్వు, డ్రెస్సింగ్ స్టైల్, మ్యూజిక్ టేస్ట్ మనల్ని ఆకట్టుకుంటాయి. వారితో ఎక్కువ సమయం గడపాలని, మన ఫ్రెండ్ సర్కిల్‌లో భాగం చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ వారితో ప్రేమలో పడాలని మాత్రం అనిపించదు. కేవలం మంచి స్నేహితులుగా మారాలనిపిస్తుంది. ప్రస్తుతం Gen Zలో ఇలాంటి ఫీలింగ్‌కే ‘ఫ్రెండ్ క్రష్’ (Friend Crush) అని పేరు పెట్టారు. అసలు ఈ కొత్త ట్రెండ్ ఏమిటి? సాధారణ క్రష్‌కు దీనికి మధ్య తేడా ఏంటి? తెలుసుకుందాం.

అసలు ఫ్రెండ్ క్రష్ అంటే ఏమిటి?

ఎవరినైనా చూసినప్పుడు వారి వ్యక్తిత్వం, అభిరుచులు, ఆలోచనా విధానం త్వరగా నచ్చేస్తాయి. వారితో స్నేహం చేయాలని, ఎక్కువగా మాట్లాడాలని అనిపించవచ్చు. అయితే వారితో డేటింగ్ చేయాలనే ఆలోచన మాత్రం రాదు. ఇలాంటి ఫీలింగ్‌నే ఫ్రెండ్ క్రష్ అంటారు.
ఉదాహరణకు, మీకు సినిమాలంటే ఇష్టమని అనుకుందాం. అదే అభిరుచి ఉన్న వ్యక్తి మీకు పరిచయమయ్యారు. వారి మాటతీరు, హాస్యం మీకు నచ్చాయి. వారితో సినిమాల గురించి మాట్లాడాలని, కలిసి సరదాగా గడపాలని అనిపిస్తుంది. కానీ ప్రేమ లేదా రొమాంటిక్ రిలేషన్‌షిప్‌పై ఆసక్తి ఉండదు. ఇదే ఫ్రెండ్ క్రష్ ప్రత్యేకత.

ఫ్రెండ్ క్రష్ ఎవరిపైన కలుగుతుంది?

Advertisement

ఫ్రెండ్ క్రష్ కలగడానికి ఎలాంటి ప్రత్యేకమైన వయసు లేదా పరిచయం అవసరం లేదు. కాలేజీలో సీనియర్, కొత్త క్లాస్‌మేట్ లేదా ఆఫీసులో సహోద్యోగి కావచ్చు. వీరిలో ఎవరితోనైనా మీకు ఫ్రెండ్ క్రష్ కావచ్చు.
కొన్నిసార్లు సోషల్ మీడియాలో చూసిన వ్యక్తులపైనా ఇలాంటి ఆసక్తి కలుగుతుంది. వారి పోస్టులు, రీల్స్, స్టోరీలు మీకు నచ్చవచ్చు. వారి అభిరుచులు తెలుసుకున్న తర్వాత స్నేహం చేయాలనిపించవచ్చు.

Also Read: వైవాహిక సమస్యలకు ‘లవ్ హార్మోన్’తో చెక్? విడాకుల నివారణకు కొత్త ప్రతిపాదన

మీకు ఫ్రెండ్ క్రష్ ఉందని చెప్పే 4 సంకేతాలు ఇవే

Advertisement

1. వారి గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తుంది
వారికి ఎలాంటి సినిమాలు ఇష్టం? ఎలాంటి పాటలు వింటారు? ఖాళీ సమయంలో ఏం చేస్తారు? వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.

2. వారితో మాట్లాడేందుకు అవకాశాలు వెతుకుతారు
వారి సోషల్ మీడియా పోస్టులకు రియాక్ట్ అవుతారు. స్టోరీలకు రిప్లై ఇస్తారు. ఎదురుపడినప్పుడు ఏదో ఒక సాకుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.

3. మీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుందని భావిస్తారు
వారి ఆలోచనలు, హాస్యం, అభిరుచులు మీకు నచ్చుతాయి. మీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుందని ఊహించుకుంటారు.

4. వారిని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో భాగం చేయాలనుకుంటారు
వారిని మీ ఇతర స్నేహితులకు పరిచయం చేయాలని అనిపిస్తుంది. అందరూ కలిసి సినిమాలకు వెళ్లడం, ట్రిప్స్ ప్లాన్ చేయడం వంటి విషయాలను ఊహించుకుంటారు.

Also Read: పిల్లల కోసం ఇంట్లో ఆయాని నియమిస్తున్నారా? ముందుగా ఈ 5 ప్రశ్నలు తప్పకుండా అడగండి

కొత్త ట్రెండ్ పెరగడానికి సోషల్ మీడియా కూడా కారణమే

గతంలో స్నేహాలు ఎక్కువగా స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు, చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడం సులభమైంది.
వారి ఫొటోలు, పోస్టులు, రీల్స్ ద్వారా అభిరుచులను తెలుసుకోవచ్చు. ఒకే రకమైన పాటలు, సినిమాలు నచ్చితే స్నేహం చేయాలనే ఆసక్తి పెరుగుతుంది.

ప్రతి ఆకర్షణ ప్రేమగా మారాల్సిన అవసరం లేదు

ఒకర నచ్చినంత మాత్రాన వారితో ప్రేమలో పడాలని లేదు. కొన్నిసార్లు మంచి స్నేహితులు దొరికితే చాలని అనిపిస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మాట్లాడటం, అభిరుచులు పంచుకోవడం, కలిసి ఆనందంగా గడపడం కూడా జీవితంలో ముఖ్యమే.

ఫ్రెండ్ క్రష్ ట్రెండ్ చెప్పే విషయం కూడా ఇదే. ప్రతి ఆకర్షణ వెనుక ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు.

Related News

పెళ్లిళ్లు, పార్టీలు, ఎయిర్‌పోర్టులలో ఇవి తినకూడదు.. ఢాక్టర్ హెచ్చరిక

ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తున్నారా? ఈ అలవాటు మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోందంటే?

మీ ఆత్మీయులే మిమ్మల్ని మోసం చేస్తే ఏం చేయాలి? మహాభారతంలో విదురడు చెప్పిన నీతి

మీరు వివాహం చేసుకున్న వ్యక్తి ధైర్యవంతుడా లేక పిరికివాడా? ఈ 5 లక్షణాలు చూసి తెలుసుకోండి

చిన్న వయసులోనే పెద్ద పెద్ద మాటలు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు ఎంతో పరిణతితో ఆలోచిస్తారు

30 ఏళ్ల వయసులోనే తెల్ల జుట్టు.. హెయిర్ కలర్ ఎన్నిసార్లు వేయాలి.. ఈ జాగ్రత్తలు పాటించండి

భారీ పెరిగిన పాల ధరలు.. అయినా నో టెన్షన్.. తక్కువ ఖర్చుతో పోషకాలు ఇచ్చే 7 ఫుడ్స్ ఇవిగో

Big Stories

Advertisement
×