E-Paper
Advertisement

ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తున్నారా? ఈ అలవాటు మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోందంటే?

ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తున్నారా? ఈ అలవాటు మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోందంటే?
Advertisement

Water Bottle Psychology: కొంతమంది ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఫోన్ మర్చిపోతే వెనక్కి వెళ్లి మరీ తెచ్చుకుంటారు. కానీ కొందరు మాత్రం వాటర్ బాటిల్ లేనిదే అడుగు కూడా బయటపెట్టరు. అసలు దాహం వేస్తుందో లేదో తెలియదు, వెళ్లే చోట నీళ్లు దొరుకుతాయని తెలిసినా సరే.. చేతిలో సొంత బాటిల్ ఉంటేనే వాళ్లకు ఏదో తెలియని భరోసా. ఆఫీసైనా, షాపింగ్ మాల్ అయినా, చివరికి రెస్టారెంట్ అయినా బాటిల్ మాత్రం కచ్చితంగా వెంట ఉండాల్సిందే. చూడటానికి ఇది చాలా చిన్న అలవాటులా అనిపించినా.. దీని వెనుక కేవలం దాహం తీర్చుకోవాలనే ఉద్దేశం మాత్రమే లేదట. మన ఆలోచనా విధానం, అలవాట్లు, ఏ విషయాన్నైనా ముందే పక్కాగా ప్లాన్ చేసుకునే మనస్తత్వం కూడా దీనికి కారణమని సైకాలజీ చెబుతోంది.

అలవాటుగా మారిన రోజువారీ పని..

సైకాలజిస్ట్ వెండీ వుడ్ పరిశోధన ప్రకారం.. మనం ఒకే వాతావరణంలో ఒక పనిని పదేపదే చేసినప్పుడు అది మనకు తెలియకుండానే అలవాటుగా మారిపోతుంది. రోజూ ఆఫీసుకు వెళ్లేటప్పుడు బాటిల్ నింపుకుని తీసుకెళ్లడం కొన్నాళ్లకు ఒక యాంత్రిక చర్యలా మారుతుంది. అందుకే బయట నీళ్లు దొరుకుతాయని తెలిసినా, బాటిల్ మర్చిపోతే మళ్లీ వెనక్కి వెళ్లి మరీ తెచ్చుకుంటారు.

పరిస్థితిని మన చేతుల్లో ఉంచుకోవడం..

Advertisement

బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే షాపుల కోసం వెతకడం లేదా వెయిటర్ కోసం ఎదురుచూడటం కొందరికి నచ్చదు. మన దగ్గరే బాటిల్ ఉంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు తాగొచ్చనే ఒక భరోసా ఉంటుంది. ఇలా మన అవసరాలను మన కంట్రోల్‌లో ఉంచుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని సైకాలజీ చెబుతోంది.

Also Read: కాలుష్యం వల్ల బయటకు వెళ్లలేకపోతున్నారా? ఫిట్‌గా ఉండేందుకు ఇంట్లోనే ఈ 5 పనులు చేయండి!

ముందుజాగ్రత్త స్వభావం..

Advertisement

మూడు గంటల ప్రయాణానికి వెళ్లేటప్పుడు దారిలో నీళ్లు కొనుక్కోవచ్చులే అని కొందరు అనుకుంటారు. కానీ ముందే బాటిల్ నింపుకునేవారు భవిష్యత్తులో వచ్చే చిన్న ఇబ్బందిని కూడా ముందే పరిష్కరించుకుంటారు. ప్రతీ విషయంలో పక్కా ప్లానింగ్‌తో, ముందుజాగ్రత్తతో ఉండే వ్యక్తులలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది.

వ్యక్తిత్వంలో ఒక భాగంగా మారడం..

కొన్నాళ్లకు ఆ బాటిల్ కేవలం ఒక వస్తువులా కాకుండా.. మన ఐడెంటిటీలో భాగమైపోతుంది. నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను, బయట ప్లాస్టిక్ బాటిళ్లు కొనను అనే భావన వారిలో బలపడుతుంది. అందుకే పొరపాటున బాటిల్ మర్చిపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది.

పర్యావరణ స్పృహ, ఆందోళన కాదు..

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదనే మంచి ఆలోచన కూడా కొందరిని సొంత బాటిల్ వైపు నడిపిస్తుంది. అయితే ఇలా బాటిల్ మోసేవారంతా అతిగా ఆందోళన చెందేవారనో, హెల్త్ పిచ్చి ఉన్నవారనో అనుకోకూడదు. దాహం వేసినప్పుడు ఇబ్బంది పడకూడదనే చిన్న ముందుచూపు మాత్రమే ఇది.

Also Read: అందగాళ్లు, శ్రీమంతులు కాదు.. ఈ 6 గుణాలున్న అబ్బాయిలంటేనే అమ్మాయిలకు పిచ్చి!

Tags

Related News

మీ ఆత్మీయులే మిమ్మల్ని మోసం చేస్తే ఏం చేయాలి? మహాభారతంలో విదురడు చెప్పిన నీతి

మీరు వివాహం చేసుకున్న వ్యక్తి ధైర్యవంతుడా లేక పిరికివాడా? ఈ 5 లక్షణాలు చూసి తెలుసుకోండి

చిన్న వయసులోనే పెద్ద పెద్ద మాటలు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు ఎంతో పరిణతితో ఆలోచిస్తారు

30 ఏళ్ల వయసులోనే తెల్ల జుట్టు.. హెయిర్ కలర్ ఎన్నిసార్లు వేయాలి.. ఈ జాగ్రత్తలు పాటించండి

భారీ పెరిగిన పాల ధరలు.. అయినా నో టెన్షన్.. తక్కువ ఖర్చుతో పోషకాలు ఇచ్చే 7 ఫుడ్స్ ఇవిగో

1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

పెసరపప్పుతో నమక్‌పారా.. ఇలా చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా అదిరిపోద్ది!

Big Stories

Advertisement
×