E-Paper
Advertisement

తక్కువ జీతంతో సొంతూరిలో ఉండాలా? లేక ఎక్కువ జీతం కోసం హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్లాలా?

తక్కువ జీతంతో సొంతూరిలో ఉండాలా? లేక ఎక్కువ జీతం కోసం హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్లాలా?
Advertisement

Job In Metro Cities Vs Tier 2 Cities| చదువు పూర్తయింది.. మంచి ఉద్యోగం వచ్చింది.. ఇక సొంతూరిని వదిలి హైదరాబాద్, బెంగళూరు, ముంబై లేదా ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లాలని చాలామంది యువత కలలు కంటారు. అక్కడ ఎక్కువ జీతం, మంచి కెరీర్, విలాసవంతమైన జీవితం ఉంటాయని భావిస్తారు. కానీ అక్కడికి వెళ్లాక అసలు ఖర్చుల లెక్క మొదలవుతుంది.

మరి ఎక్కువ జీతంతో మెట్రో నగరంలో పనిచేయడం మంచిదా? లేక తక్కువ జీతంతో సొంతూరిలో ఉండటమే లాభదాయకమా? ఈ నిర్ణయం తీసుకునే ముందు అసలు లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

1. ఎక్కువ జీతం వస్తున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి

Advertisement

ఒక ఫ్రెషర్‌కు మెట్రో నగరంలో ఏడాదికి మంచి జీతం అంటే రూ.5 లక్షల ప్యాకేజీ వచ్చిందనుకుందాం. అంటే నెలకు సుమారు రూ.41,600 జీతం వస్తుంది. అదే సొంతూరిలో ఉద్యోగం చేస్తే ఏడాదికి రూ.3 లక్షలు, నెలకు రూ.25 వేలు రావచ్చు.
రెండు జీతాల మధ్య రూ.16,600 వ్యత్యాసం ఉంటుంది. అయితే మెట్రో నగరాల్లో ఇంటి అద్దె, భోజనం, ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 2023 RentOk సమాచారం ప్రకారం, ముంబైలో ముగ్గురు కలిసి ఉండే పీజీ గది అద్దె సుమారు రూ.12 వేలు. ఢిల్లీలోనూ అద్దెలు ఇదే స్థాయిలో ఉన్నాయి. దీంతో అదనంగా వచ్చే జీతంలో ఎక్కువ భాగం ఖర్చవుతుంది.

2. ఇల్లు అద్దెకు తీసుకుంటే ఖర్చు మరింత పెరుగుతుంది

ఉద్యోగం ప్రారంభంలో పీజీలో ఉండటం సులభమే. కానీ పెళ్లయ్యాక లేదా కుటుంబంతో ఉండాలనుకున్నప్పుడు ఇల్లు తీసుకోవాల్సి వస్తుంది.
2024లో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో 1,000 చదరపు అడుగుల 2BHK ఇంటి అద్దె సుమారు రూ.30 వేలు. హైదరాబాద్‌లో సగటున రూ.20 వేలు ఇంటి రెంట్ ఉంటుంది. లక్నోలోని ఇందిరా నగర్‌లో ఇలాంటి ఇళ్ల అద్దె రూ.14 నుంచి15 వేల మధ్య ఉంది. అంటే నగరాన్ని బట్టి నెలకు దాదాపు రూ.20 వేల వరకు అదనంగా చెల్లించాల్సి రావచ్చు.

3. కుటుంబ నియంత్రణపై పెరుగుతున్న ఖర్చుల ప్రభావం

Advertisement

నగరాల్లో జీవన వ్యయం పెరగడంతో యువ జంటలు పెళ్లి, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి కాలేజీ చదువు పూర్తయ్యేవరకు ఒక బిడ్డ పెంపకానికి రూ.38 నుంచి 45 లక్షలు ఖర్చవుతుందని అంచనాలు చెబుతున్నాయి.

అందుకే కొందరు దంపతులు ఇద్దరూ సంపాదిస్తున్నా DINK (Double Income, No Kids) జీవన విధానాన్ని ఎంచుకుంటున్నారు. అంటే ఇద్దరూ సంపాదిస్తూ పిల్లలు లేకుండా జీవించడం. అయితే దీనికి వ్యక్తిగత అభిరుచులు, కెరీర్ లక్ష్యాలు కూడా కారణమవుతాయి.

4. మెట్రో నగరాల్లో సైడ్ బిజినెస్‌కు అవకాశాలున్నా స్థలం సమస్య

పెద్ద నగరాల్లో ఆన్‌లైన్ వ్యాపారాలకు ఎక్కువ కస్టమర్లు, మెరుగైన డెలివరీ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఉత్పత్తులు, ప్యాకింగ్ సామగ్రిని నిల్వ చేసేందుకు స్థలం దొరకడం కష్టమవుతుంది. ప్రత్యేకంగా గోడౌన్ తీసుకుంటే అదనపు అద్దె భారం పడుతుంది.

Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు

5. సొంతూరికి తిరిగి వెళ్లడం సరైన నిర్ణయమా?

విజయవాడ, తిరుపతి, వరంగల్, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, కొచ్చి వంటి నగరాలు ఉద్యోగ అవకాశాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అనుభవం ఉన్న ఉద్యోగులకు కొన్ని చిన్న నగరాల్లోనూ మంచి జీతాలు లభిస్తున్నాయి. సొంతూరికి తిరిగి వెళ్తే ఇంటి అద్దె తగ్గడంతోపాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది.

Also Read: ఉద్యోగానికి దరఖాస్తు చేయనే లేదు.. విద్యార్థికి రూ.50 లక్షలు జీతం ఇస్తామని రెండు కంపెనీ ఆఫర్లు

6. రెండు నగరాల్లో ఇంటి అద్దెల భారం

హైబ్రిడ్ ఉద్యోగాల వల్ల కొందరు సొంతూరితోపాటు ఉద్యోగం చేసే నగరంలోనూ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు. దీంతో ఉపయోగించని ఇంటికి కూడా అద్దె చెల్లించాల్సి వస్తుంది. ఫర్నిచర్, ఇతర వస్తువులను స్టోరేజ్ కేంద్రాల్లో ఉంచడం ద్వారా ఈ ఖర్చును కొంత తగ్గించుకోవచ్చు.

ఎక్కువ జీతం కాదు.. ఎక్కువ పొదుపే ముఖ్యం

మెట్రో నగరాల్లో ఉద్యోగం చేయడం వల్ల కెరీర్ అభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే జీతం ఎక్కువగా ఉందని మాత్రమే ఉద్యోగాన్ని ఎంచుకోకూడదు. అద్దె, ప్రయాణం, భోజనం, ఇతర ఖర్చులను లెక్కించాలి. కెరీర్ ఎదుగుదలతోపాటు ఎంత డబ్బు ఆదా చేయగలుగుతున్నామో కూడా పరిశీలించాలి. చివరికి ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం కంటే ఎక్కువ పొదుపునకు అవకాశం ఇచ్చే ఉద్యోగమే ఆర్థికంగా మేలు చేయవచ్చు.

Related News

ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 13న బ్యాంకులకు సెలవు.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్రాంచ్‌లు క్లోజ్!

బంగారం ధర పతనం.. కొనుగోలుదారుల్లో ఒకటే ఆనందం, కొన్నాళ్ల వరకు పతనం?

2 బీహెచ్‌కే ఫ్లాట్‌ని కేవలం రూ. 155.. ఇంతకీ ఎక్కడో తెలుసా? ఆనందంలో కొనుగోలుదారుడు

వాహనదారులకు కడుపు మంట.. చమురు కంపెనీల లాభాల పంట

బిర్యానీ ధరకు ఇల్లు మీ సొంతం.. కేవలం రూ.155కే రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్

రూ.1లక్ష పెట్టుబడితో..లక్షలు సంపాదించండి,పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ బెనిఫిట్స్ ఇవే!

ఈ సెలబ్రిటీల విడాకులు చాలా కాస్ట్లీ గురూ.. స్పీల్‌బర్గ్ కొంప ముంచిన టిష్యూ!

Big Stories

Advertisement
×