BigTV English

Curry Leaves Face Pack: గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ ఇదే !

Curry Leaves Face Pack: గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ ఇదే !

Curry Leaves Face Pack: అందంగా కనిపించడం కోసం ప్రతీ ఒక్కరు ఏదో ఒక ఫేస్ క్రీమ్ వాడుతూనే ఉంటారు. వాటి వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు కూడా వస్తాయి. ఫలితంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. అలాంటి సమయంలో న్యాచురల్‌గా అందంగా కనిపించడం కోసం వంటింట్లో ఉండే పదార్థాలను వాడవచ్చు.


ఇంట్లోనే రకరకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. వాటి వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది. అయితే అలాంటి ఫేస్ ప్యాక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదే కరివేపాకు ఫేస్ ఫ్యాక్ . కరివేపాకులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉంటే ఈ లక్షణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తాయి. జుట్టు ఆరోగ్యానికి కూడాకరివేపాకు ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే కరివేపాకు ఫేస్ ప్యాక్ వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా ముఖం కాంతి వంతంగా మారుతుంది. కరివేపాకులో ఉండే పోషకాలు చర్మానికి తేమను అందిస్తాయి.

కరివేపాకు ఫేస్ ప్యాక్: 


కరివేపాకు ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా 10 కరివేపాకు రెమ్మలను నీటిలో ఉడకబెట్టాలి. ఆ తర్వాత నీటిలో నుంచి తీసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ లో కాస్త పెరుగు లేదా పాలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన ఈ ఫేస్ ప్యాక్‌ను 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

Also Read: ఒక్కసారి ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మీ ముఖం మిలమిలా మెరిసిపోద్ది

వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ ముఖం ఉన్న, మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అంతే  కాకుండా చర్మం కాంతి వంతంగా అందంగా మారుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×