BigTV English
Advertisement

Kerala Government: చిత్ర పరిశ్రమలో వేధింపులు.. విచారణ కోసం కమిటీ ఏర్పాటు

Kerala Government: చిత్ర పరిశ్రమలో వేధింపులు.. విచారణ కోసం కమిటీ ఏర్పాటు

Kerala Government: మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటూ ఆర్టిస్టులు ఆరోపించడం తీవ్ర సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటినీ ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు పోలీస్ ఉన్నతాధికారులతో కూడిన ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం.


Also Read: తెలుగు ఎంతో అద్భుతమైన భాష.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ

మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ ఓ నటి ఆరోపించారు. ఇదే సమయంలో ప్రముఖ డైరెక్టర్, కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్షడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీకి చెందిన పలువురు రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన కేరళ ప్రభుత్వం .. పోలీసు అధికారులతో కూడిన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఇందుకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.


Related News

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Big Stories

×