BigTV English

Anti Aging Fruits: ఈ పండ్లు తింటే బరువు తగ్గడంతో పాటు అందం కూడా మీ సొంతం

Anti Aging Fruits: ఈ పండ్లు తింటే బరువు తగ్గడంతో పాటు అందం కూడా మీ సొంతం

Anti Aging Fruits: తరచూ తీసుకునే ఆహారంలో ఆరోగ్యాన్ని కాపాడేందుకు పండ్లు ముఖ్య పాత్రను పోషిస్తాయి. కూరగాయలతో పాటు తరచూ పండ్లను కూడా తీసుకుంటూ ఉండే ఆరోగ్యంతో పాటు అందంగా కూడా ఉండవచ్చు. అంతేకాదు అధిక బరువు వంటి సమస్యలు ఉన్న వారు పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక బరువు సమస్యల బారిన పడుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే సమయం కూడా లేకపోవడంతో ఇలాంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అయితే పండ్లను కేవలం ఆరోగ్యం, అందానికి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. అయితే కొన్ని పండ్లు తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్ల వివరాలు ఏంటో తెలుసుకుందాం.


బరువు తగ్గడానికి పండ్లు ముక్య పాత్ర పోషిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో ప్రచురితమైన దాని ప్రకారం శరీరంలో విటమిన్ సి లోపం వల్ల కూడా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. ఈ తరుణంలో విటమిన్ సి ఉండే పండ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా యవ్వనంగా ఉండేందుకు కూడా పండ్లు తోడ్పడతాయి.

పైనాపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియ మెరుగుపరచేందుకు సహకరిస్తాయి. అంతేకాదు ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇక బొప్పాయి పండును కూడా తసీుకుంటే ఇందులో ఉండే విటమిన్ సి, ఎ, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల మంటను తగ్గించేందుకు కూడా తోడ్పడతాయి. అంతేకాదు గుండె సంబంధింత సమస్యను కూడా తగ్గిస్తుంది.


ఇక కివి పండును కూడా తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అంతేకాదు కివిలో ఉండే విటమిన్ సి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక జామకాయను తినడం వల్ల ఇందులో ఉండే ఖనిజాలు, పోషకాలు శరీరంలో ఉండే కొవ్వును కరిగించేందుకు సహాయపడతాయి. స్ట్రాబెర్రీలను ప్రతీరోజూ తీసుకుంటే కూడా పోషకాలు అంది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×