BigTV English

Hair Care Routine: జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

Hair Care Routine: జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

Hair Care Routine:  ఆరోగ్యవంతమైన, మెరిసే జుట్టు మన అందాన్ని పెంచుతుంది. అంతే కాకుండా  ఆత్మవిశ్వాసాన్ని  కూడా  రెట్టింపు చేస్తుంది. మనం  ప్రతి రోజూ  పాటించే అలవాట్లు, తీసుకునే జాగ్రత్తలు జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని రకాల హెయిర్  కేర్ టిప్స్  తప్పకుండా పాటించడం ద్వారా జుట్టు రాలడం, చివర్లు చిట్లడం వంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు. అంతే కాకుండా వీటిని ట్రై చేయడం వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది.  ఇంతకీ ఎలాంటి టిప్స్ పాటించడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుందనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


జుట్టు సంరక్షణలో మొదటి అడుగు సరైన షాంపూ ఎంపిక చేసుకోవడం. మీ జుట్టు రకానికి (జిడ్డు, పొడి, నార్మల్, లేదా రంగు వేసిన జుట్టు) సరిపోయే షాంపూను ఎంచుకోవడం చాలా ముఖ్యం. సల్ఫేట్స్ , పారాబెన్స్ వంటి హానికరమైన రసాయనాలు లేని షాంపూలను వాడటం మంచిది.  అంతే కాకుండా తరచుగా తలస్నానం చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది జుట్టులోని సహజ నూనెలను తొలగించి పొడిబారేలా చేస్తుంది. జుట్టు రకాన్ని బట్టి వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేయడం సరిపోతుంది. తలస్నానం చేసేటప్పుడు గోరువె చ్చని నీటితో జుట్టును పూర్తిగా తడిపి, తక్కువ మొత్తంలో షాంపూను తీసుకుని తలపై సున్నితంగా మసాజ్ చేయాలి. జుట్టు చివర్లకు షాంపూను నేరుగా రాయకుండా జాగ్రత్త పడాలి. షాంపూను పూర్తిగా కడిగేసిన తర్వాత, కండిషనర్ వాడటం తప్పనిసరి.
కండిషనర్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా చిక్కులు పడకుండా చూస్తుంది . అవసరం అయిన తేమను కూడా అందిస్తుంది.  కండిషనర్‌ను జుట్టు మధ్య భాగం నుంచి చివర్ల వరకు రాయాలి కానీ కుదుళ్లకు అంటించకూడదు. ఎందుకంటే ఇది జుట్టు జిడ్డుగా మారడానికి దారితీస్తుంది. దీనిని రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచి, చల్లని నీటితో పూర్తిగా శుభ్రం చేయండి. చల్లని నీరు జుట్టు క్యూటికల్స్‌ను మూసివేసి, మరింత మెరుపును అందిస్తాయి.

తలస్నానం చేసిన తర్వాత జుట్టును ఆరబెట్టడంలో కూడా జాగ్రత్త అవసరం. జుట్టును తువ్వాలుతో గట్టిగా రుద్దడం మానుకోండి. బదులుగా, సున్నితంగా అద్దడం ద్వారా అదనపు నీటిని తొలగించండి. వీలైనంత వరకు జుట్టును సహజంగా గాలిలో ఆరనివ్వడం ఉత్తమం. డ్రైయర్స్, స్ట్రెయిట్‌నెర్స్ వంటి హీట్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ తరచుగా వాడటం వల్ల జుట్టు పాడవుతుంది కాబట్టి వాటిని తగ్గించడం మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే.. హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేను తప్పకుండా ఉపయోగించండి.జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి, తడి జుట్టును దువ్వడం మానుకోండి. పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే వెడల్పాటి పళ్లతో ఉండే దువ్వెనను ఉపయోగించి చిక్కులు లేకుండా దువ్వండి. జుట్టు చివర్ల నుంచి చిక్కులను విడదీస్తూ నెమ్మదిగా పైకి దువ్వాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు జుట్టుకు నూనె రాయడం జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. కొబ్బరి నూనె, ఆముదం, బాదం నూనె లేదా ఆలివ్ నూనె వంటివి జుట్టుకు చాలా మంచివి. నూనెను గోరువెచ్చగా చేసి తలకు, జుట్టుకు సున్నితంగా మసాజ్ చేసి, రాత్రంతా ఉంచి ఉదయం తలస్నానం చేయవచ్చు. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. అంతే కాకుండా కుదుళ్లను బలోపేతం చేస్తుంది. రక్త ప్రసరణను కూడా  పెంచుతుంది.

జుట్టు ఆరోగ్యం కేవలం బాహ్య సంరక్షణపైనే కాకుండా.. అంతర్గత ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు ఖనిజాలు (సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా తగినంత నీరు తాగడం కూడా జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఒత్తిడి జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి కాబట్టి.. యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించడంలో సహాయ పడతాయి. జుట్టును గట్టిగా కట్టడం లేదా బిగుతుగా ఉండే హెయిర్‌బ్యాండ్‌లు వాడటం వల్ల జుట్టుకు నష్టం కలుగుతుంది. కాబట్టి వదులుగా ఉండే హెయిర్‌స్టైల్స్ ఎంచుకోండి. చివరగా.. ప్రతి ఆరు నుంచి ఎనిమిది వారాలకు ఒకసారి జుట్టు చివర్లను కట్ చేయడం వల్ల చివర్లు చిట్లడం తగ్గి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మీరు ఆరోగ్యవంతమైన, బలంగా, మెరిసే జుట్టును సొంతం చేసుకోవచ్చు.


Related News

Health Benefits: బిర్యాని ఆకుతో బోలెడు ప్రయోజనాలు.. ఒక్కసారి వాడితే మంచి ఫలితాలు

Skin Glow: నేచురల్‌గానే.. ముఖం మెరిసిపోవాలంటే ?

Curd vs Buttermilk:పెరుగు Vs మజ్జిగ.. రెండిట్లో ఏది బెటర్ ?

Mustard infusion: ఆవాల కషాయం అంత మంచిదా? దీని తయారీ చాలా సింపుల్!

Kidney Disease: కిడ్నీలు పాడయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Watermelon Seeds: రోజుకో స్పూన్ పుచ్చకాయ గింజలు.. ఇన్ని ప్రయోజనాలా ?

Big Stories

×