BigTV English

Vijay Devarakonda: హాస్పిటల్ పాలైన నటుడు విజయ్ దేవరకొండ.. ఏం జరిగిందంటే?

Vijay Devarakonda: హాస్పిటల్ పాలైన నటుడు విజయ్ దేవరకొండ.. ఏం జరిగిందంటే?

Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరం(Dengue Fever)తో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోనే ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 20వ తేదీ వరకు విజయ్ దేవరకొండ హాస్పిటల్ లోనే ఉండబోతున్నారని 20వ తేదీ డిశ్చార్జ్ కాబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. మరి విజయ్ దేవరకొండ హాస్పిటల్ పాలైనటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం హల్చల్ చేస్తుంది.


డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న విజయ్…

ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదా తన పిఆర్ టీమ్ కానీ ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. అయితే ఈయన హాస్పిటల్ లో ఉన్నారంటూ వార్తలు బయటకు రావడంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పష్టత ఇస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ఈయన త్వరలోనే కింగ్ డం(King Dom) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా జులై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


కింగ్ డం పైనే ఆశలు…

డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్స్ సినిమాపై ఎంతో మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా అన్నా తమ్ముడు సెంటిమెంట్ కూడా ఉంటుందని ఇటీవల విడుదల చేసిన సాంగ్ ద్వారా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవర కొండ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sree Borse), సత్యదేవ్ నటిస్తున్నారు. సీతార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చూనర్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఆ మూవీని రిలీజ్ చేస్తున్నారు. పూర్తి స్థాయి కమర్షియల్ ఫిల్మ్‌గా కింగ్‌డమ్‌ను రూపొందించారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

సామ్రాజ్యం..

ఇక ఈయన చివరిగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా పరవాలేదు అనిపించుకుంది. ఇక కింగ్ డం తర్వాత విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలో రౌడీ జనార్దన్ అనే సినిమాలో నటించబోతున్నారు అదేవిధంగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో కూడా మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే కింగ్ డం సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా జూలై 31వ తేదీ తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కాబోతుంది. ఇక హిందీలో ఈ సినిమా కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే పరిమితమవుతుంది అలాగే హిందీలో సామ్రాజ్యం అనే పేరిట విడుదల కానుంది.

Also Read: Madhavan: సగం మంది హీరోలు అదే కోరుకుంటారు… ప్రియాంక పై మాధవన్ ప్రశంసలు!

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×