Cigarette Tea Health Risk| అనేక రకాల ఆహార కలయికలు రుచికరంగా ఉండడమే కాక, పోషకాలను కూడా అందిస్తాయి. కానీ కొన్ని కలయికలు ఆరోగ్యానికి హానికరం. అలాంటి ఒక ప్రమాదకరమైన కలయికే టీ, సిగరెట్. ఇవి రెండూ ఒకేసారి తాగడం చాలా డేంజరస్. చాలా మంది.. ముఖ్యంగా యువత, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ కాంబినేషన్‌ను ఇష్టపడతారు. కానీ వైద్యుల ప్రకారం.. ఈ టీ-సిగరెట్ కలయిక ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.
2023లో అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. వేడి టీ తాగడం వల్ల గొంతు కణాలు దెబ్బతింటాయి. దీంతో పాటు సిగరెట్ తాగితే ఈ ప్రమాదం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలంలో ఈ అలవాటు క్యాన్సర్‌కు కారణం కావచ్చు. టీలోని కెఫీన్ సాధారణంగా కడుపులో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ కెఫీన్ తక్కువ స్థాయిలో ఉంటే ఆరోగ్యకరం. అధిక కెఫీన్ కడుపు లైనింగ్‌ను దెబ్బతీస్తుంది. సిగరెట్‌లోని నికోటిన్‌తో కెఫీన్ కలిసినప్పుడు, ఖాళీ కడుపుతో ఈ కలయిక తీవ్రమైన తలనొప్పి, మైకము కలిగిస్తుంది.
హెచ్చరిస్తున్న వైద్యులు:
సిగరెట్ తాగేవారిలో గుండెపోటు ప్రమాదం 7 శాతం ఎక్కువగా ఉంటుంది. వారి జీవితకాలం 20 సంవత్సరాల వరకు తగ్గవచ్చు. వేడి టీ నుంచి వచ్చే ఆవిరి, సిగరెట్ పొగతో కలిస్తే ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. కాలక్రమేణా, ఊపిరితిత్తులకు వాటంతట అవే రిపేర్ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
క్యాన్సర్ ప్రమాదం: టీతో సిగరెట్ తాగడం గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని 30 శాతం వరకు పెంచుతుంది. ఇది కణాలను దెబ్బతీసి ఇతర క్యాన్సర్లను కూడా తెచ్చిపెడుతుంది.
గుండె సమస్యలు: సిగరెట్‌లోని నికోటిన్, టీలోని కెఫీన్ కలిసి గుండె గతిని, రక్తపోటును పెంచి, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఊపిరితిత్తుల సమస్యలు: ఉదయం టీతో సిగరెట్ తాగితే శ్వాసకోశ మార్గాలు చికాకు పడతాయి. ఇది దీర్ఘకాల బ్రాంకైటిస్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD)కి దారితీస్తుంది.
సినర్జిస్టిక్ ప్రభావం: సిగరెట్ పొగ, టీ కలిస్తే హాని రెట్టింపవుతుంది. నికోటిన్ గొంతు కండరాలను సడలించి, వేడి టీతో కలిస్తే గుండెల్లో మంట, జీర్ణ సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది.
Also Read: ఉదయం లేవగానే వీటిని చూడకూడదు.. ఆరోగ్యం, జ్యోతిష్య రీత్యా అరిష్టం..
సిగరెట్ తాగడానికి ఎందుకు ఇష్టపడతారు? శరీరంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది?
సిగరెట్ తాగడం ఆనందంగా అనిపిస్తుంది, కానీ ఒకసారి అలవాటైతే వదిలించుకోవడం కష్టం. నికోటిన్ మెదడులో ఆనందాన్ని కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది, ఇది ఒత్తిడిని తగ్గించి, శక్తిని, దృష్టిని పెంచుతుంది. సిగరెట్ సామాజిక కార్యకలాపంగా లేదా రోజువారీ అలవాటుగా మారుతుంది. కానీ సిగరెట్‌లోని వేల రసాయనాలు చర్మం, గోళ్లు, అవయవాలు, డీఎన్‌ఏను దెబ్బతీస్తాయి. మీరు సిగరెట్ వెలిగించిన క్షణం నుంచి ఈ హాని మొదలవుతుంది.
ఆరోగ్యకరమైన జీవనం కోసం, టీ-సిగరెట్ కలయికను నివారించండి. సిగరెట్ మానేయడం కష్టమైనా, వైద్య సహాయంతో దాన్ని అధిగమించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోండి!