Hari Hara Veeramallu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో అంటే ఖచ్చితంగా వినిపించే పేరు పవన్ కళ్యాణ్. కొంతమంది హీరోలకు సూపర్ హిట్ సినిమాలు పడితే మంచి పేరు వస్తుంది. కానీ వరుసగా పదేళ్లపాటు డిజాస్టర్ సినిమాలో వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ కి రెమ్యూనరేషన్, క్రేజ్ రెండూ పెరుగుతూ వెళ్లాయి. జానీ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్ల వరకు పవన్ కళ్యాణ్ కెరియర్ లో హిట్ సినిమా లేదు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా అయితే చూడాలి అనుకుంటారు అలా చూపించి, ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ అందించాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉన్నా కూడా ఆ సినిమాకు సంబంధించిన ఆడియో మాత్రం సూపర్ హిట్.
పవన్ కళ్యాణ్ పాటలు ప్రత్యేకం
రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ సినిమాల్లో పాటలు మామూలుగా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో పాటలు అంటేనే వేరే రేంజ్ లో ఉండేవి. సినిమా రిజల్ట్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సినిమా ఆల్బమ్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్. జానీ సినిమా డిజాస్టర్ అయిన కూడా ఆ సినిమా పాటలే అప్పట్లో ఎక్కువ కలెక్ట్ చేశాయి. ఖుషి లాంటి సినిమాలో హిందీ పాటలు పెట్టడం, తమ్ముడు లాంటి సినిమాలు ఇంగ్లీష్ పాటను పెట్టడం ఇటువంటి ప్రయోగాలన్నీ పవన్ కళ్యాణ్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ కూడా ఆ పాటలను చాలామంది పాడుతూ ఉంటారు. బాలు, గుడుంబా శంకర్, బంగారం వంటి సినిమాలు హిట్ కాకపోయినా కూడా ఆ సినిమా పాటలు మాత్రం ఇప్పటికీ ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేస్తాయి. ఆ పాటలు విని సినిమాలకు వెళ్లిపోయిన ఆడియన్స్ కూడా ఉండేవాళ్ళు.
పవన్ కళ్యాణ్ సినిమా పాటలా ఇవి.?
పవన్ కళ్యాణ్ నటించిన 25వ సినిమా అజ్ఞాతవాసి పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఒకప్పుడు సమాజానికి ఉపయోగపడే పాటను ఫస్ట్ సాంగ్ గా పెట్టుకునే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది తర్వాత ఆ ప్రయోగాలను తగ్గించేశారు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సినిమా పాటలు ఏవి పెద్దగా గుర్తుండే స్థాయిలో లేవు. వకీల్ సాబ్ కొంతమేరకు పరవాలేదు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలోని ఒక్క పాట కూడా ఆకట్టుకునే విధంగా లేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలోని పాటలను రిపీట్ గా వింటుంటారు. కానీ ఈ పాటలకు రిపీట్ వాల్యూ లేదు అనేది వాస్తవం. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి వంటి సంగీత దర్శకులు ఉన్నా కూడా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే ఆల్బమ్ ఇవ్వలేకపోయారు. అయితే కొన్నిసార్లు పాటలు సినిమా కథ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఈ రకంగా చూస్తే కీరవాణిని కూడా తప్పు పట్టడానికి లేదు. ఇక సినిమా ఫలితం ఎలా ఉంటుందో జూన్ 12న తెలియనుంది.
Also Read: Hari Hara VeerMallu : 90 శాతం కంటెంట్ చూపించలేదు, మాస్టర్ ప్లాన్ వేసిన నిర్మాత