Pain killers effects kidney: తల నొప్పి, కాలు నొప్పి, కీళ్ల నొప్పులు ఇలా ఏ రకమైన నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్స్ వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. వీటిని వాడినప్పుడు నొప్పి నుంచి ఉపశమనం లభించడం వరకు బాగానే ఉంటుంది. నొప్పి, వాపులను తగ్గి్ంచేందుకు నాన్-స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ వినియోగిస్తారు. వీటిని NSAIDs అని పిలుస్తారు. నొప్పిని తగ్గించడమే కాకుండా ఆర్థరైటిస్, మైగ్రేన్, పీరియడ్ క్రంప్స్, జ్వరం వంటి వాటిని తగ్గించేందుకు కూడా ఇవి సహాయపడతాయి. అయితే, వీటిని అధికంగా వాడితే కిడ్నీలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందంటున్నారు.
NSAIDs తీసుకునే వారిలో దాదాపు 50% మందికి కిడ్నీ ఫంక్షన్‌పై చెడు ప్రభావం పడిందని అధ్యయనాలు చెబుతున్నాయట. ముఖ్యంగా ఎక్కువ కాలం పాటు పెయిన్ కిల్లర్స్ వాడిన వారిలో కిడ్నీల ఆరోగ్యం విపరీతంగా క్షీణంచిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పెయిన్ కిల్లర్స్ సైడ్ ఎఫెక్ట్స్..
గతంలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారు, లేదా ప్రస్తుతం కిడ్నీ సమస్యలుతో ఇబ్బంది పడుతున్న వారు పెయిన్ కిల్లర్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల కిడ్నీ సమస్యలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పెయిన్ కిల్లర్స్ డాడడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుందట. ఇది కిడ్నీలపై చెడు ప్రభావం చూపడంతో మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: విటమిన్-డి ఎక్కువైతే..?
వయస్సు పెరిగేకొద్దీ కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. వీటి వల్ల నిద్ర కూడా పట్టదు. అలాంటి సమయంలో చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడతారు. దీంతో కిడ్నీ పని తీరుపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
కిడ్నీలను రక్షించేదెలా..?
ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కిడ్నీలను కాపాడుకోవాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే పెయిన్ కిల్లర్స్ వాడుతున్న వారు వీటిని తీసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే వీటిని వీలైనంత తక్కువ మోతాదులో వేసుకోవాలని చెబుతున్నారు.
ఒకవేళ పెయిన్ కిల్లర్స్ తప్పకుండా వాడాల్సి వస్తే.. వీటిని వేసుకున్నన్ని రోజులు నీరు ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్నిసార్లు, వేరే మెడిసిన్‌తో పాటు NSAIDs కూడా తీసుకుంటారు. దీని వల్ల నొప్పి తగ్గిపోతుంది. కానీ దీని వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.