Noida Crime News: భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి. అపోహాలు, అనుమానాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు. అవి ఎంతకైనా దారి తీస్తాయి. చివరకు ఫ్యామిలీని ఛిన్నాభిన్నం చేస్తాయి. అలాంటి ఘటన ఒకటి నొయిడాలో చోటు చేసుకుంది. కేవలం అనుమానంతో భార్యని సుత్తితో కసి తీరా కొట్టి కొట్టి చంపేశాడు భర్త. ఆ తర్వాత పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అసలేం జరిగింది?
అనుమానం పెనుభూతం
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టర్ 15లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పైన కనిపిస్తున్న నిందితుడి పేరు నూర్ ఉల్ లాహ్ హైదర్.ఆయన వయస్సు 55 ఏళ్లు కాగా, ఆపై కంప్యూటర్ ఇంజినీర్ కూడా. అతని భార్య పేరు ఆస్మా ఖాన్, వయస్సు 42 ఏళ్లు. ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడడంతో ఈ దంపతులకు డబ్బులకు కొదవలేదు.
ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు బీటెక్ విద్యార్థి కాగా, మరొకరికి 12 ఏళ్లు . అంటే ఇంటర్ చదువుతోంది. ఇంతవరకు స్టోరీ బాగానే సాగింది. బీటెక్ చదువుతున్న కొడుకు ఉన్నా, భార్యపై నూర్ ఎక్కడో చిన్న అనుమానం. ఇది చాలా కాలంగా ఉండేది.. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
భార్యభర్తల మధ్య తరచు గొడవలు
గురువారం భార్యభర్తల మధ్య గొడవ మరింత ముదిరి పాకాన పడింది. రాత్రంతా గొడవకు దిగడంతో ఇరువురు మధ్య ఆవేశాలు పెరిగిపోయాయి. పట్టరాని కోపంతో శుక్రవారం బెడ్రూమ్ డోర్‌ని లాక్ చేసిన నూర్, భార్యపై దాడి చేశాడు.ఆమెపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశాడు. అయినప్పటికీ నూర్ కు కోపం తగ్గలేదు. అందుబాటులో ఉన్న సుత్తి తీసుకుని కసి, కోపం తీరిపోయే వరకు భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆ రూమ్ అంతా రక్తంగా మారింది.
ALSO READ: ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది? ఒకేసారి ఆరుగురు, ఎందుకు?
శుక్రవారం నూర్ కొడుకు తన కజన్ సోదరికి ఫోన్ చేసి చెప్పాడు. నాన్న.. అమ్మని చంపేశాడని చెబుతూ ఏడ్చాడు. చివరకు బంధువులు అక్కడికి చేరుకునే సరికి ఆస్మా రక్తపు మడుగులో పడి ఉంది. మరోవైపు నిందితుడు నూర్, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగినదంతా చెప్పాడు. కేవలం వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తన భార్యను చంపినట్టు నిజాన్ని అంగీకరించాడు.
ఆస్మా ఫ్యామిలీ వెర్షన్
ఆస్మా తరపు కుటుంబసభ్యులు కొన్ని వివరాలను తెలిపారు. రాత్రంతా గొడవపడటంతో ఆస్మా తన సోదరి, తల్లికి ఫోన్ చేసింది. జరిగినదంతా చెప్పింది కూడా. చివరకు ఆస్మా సోదరి, ఆమె తల్లి శుక్రవారం నోయిడాకు వచ్చారు. ఆస్మా-నూర్‌లను దగ్గరపెట్టి మాట్లాడారు.. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
శుక్రవారం ఉదయం ఆస్మా ఇంటి నుంచి ఆమె సిస్టర్ ఫరిదా ఇంటికి వెళ్లిపోయింది. పిల్లలు ఎవరి గదులకు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఆస్మా-నూర్లు తమ రూమ్‌ని లాక్ చేసుకున్నారు. ఈలోపు జరగాల్సిన దంతా జరిగిపోయింది. ఆస్మా ఈ లోకాన్ని విడిచిపెట్టేసింది.
ALSO READ: మిస్సయిన మూడేళ్లకి ప్రియుడితో ఆ మహిళ