Liver Damage: మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం కూడా ఒకటి. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఈ అవయవానికి చాలా నష్టం కలిగిస్తున్నాయి. చిన్న వయస్సులోనే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం (ఫ్యాటీ లివర్) వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. ఇదే కాకుండా, కొన్ని ఇతర కారణాలు కూడా కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమస్య తీవ్రం అయితే ప్రాణాంతకం కూడా కావచ్చు.
లివర్ డ్యామేజ్ అయితే.. ఇది కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో విష పదార్థాలు పెరగడం ప్రారంభమవుతాయి.
నిజానికి.. మన కాలేయం శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది శరీరం నుండి వ్యర్థ, హాని కలిగించే పదార్థాలను తొలగించడంతో పాటు జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. కాలేయం డ్యామేజ్ అయినప్పుడు మొత్తం శరీరం యొక్క పనితీరు ప్రభావితం అవుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు దీని ప్రారంభ లక్షణాలపై శ్రద్ధ వహించి.. సకాలంలో చికిత్స తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
కాలేయ సమస్యలపై శ్రద్ధ వహించండి:
కాలేయం దెబ్బతినే ప్రమాదం:
కాలేయం దెబ్బతినడానికి అనేక కారణాలు ఉంటాయి. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం, వైరల్ హెపటైటిస్, ఫ్యాటీ లివర్ సమస్య లేదా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కాలేయానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది.
కాలేయం దెబ్బతినే ముందు కొన్ని ప్రారంభ లక్షణాలు మన శరీరంలో కనిపిస్తాయి. కానీ చాలా మంది వీటిని అంతంగా పట్టించుకోరు. సమస్య తీవ్రం అయిన తర్వాత ఎక్కువ మంది డాక్టర్ దగ్గరకు వెళ్తారు. ముందుగానే ఈ ప్రమాదాన్ని గుర్తిస్తే.. సమస్య నుండి ఈజీగా బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి.
జీర్ణ సమస్యలు:
కాలేయం దెబ్బతినే లక్షణాలు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, కాలేయం దెబ్బతినే స్థాయిపై ఆధారపడి ఉంటాయి. చాలా లక్షణాలు ప్రారంభంలో కనిపిస్తాయి.
కాలేయ వాపు ఈ అవయవానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. దీనిని పట్టించుకోకపోతే.. త్వరగా కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే మీకు ఎక్కువగా కడుపులో నొప్పి వస్తున్నా.. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా.. మలబద్ధకం ఎక్కువ రోజులు కొనసాగినా ఇలాంటి సంకేతాలను లైట్ తీసుకోవద్దు. ఇది కాలేయం దెబ్బతింటోందని తెలిపే ముందస్తు సంకేతాలు.
తరచుగా అలసట, బలహీనత:
అలసిపోయినట్లు అనిపించడం సాధారణమే.. కానీ ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తే దీనిని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇది కాలేయ సమస్యలు లేదా కాలేయం దెబ్బతినడానికి కూడా సంకేతం కావచ్చు. కాలేయ సమస్యల కారణంగా.. శరీరంలో మెలటోనిన్ , గ్లూకోజ్ హార్మోన్లలో సమస్యలు పెరగడం ప్రారంభమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మార్పుల కారణంగా.. అలసిపోయినట్లు అనిపించడం లేదా బాగా నిద్ర పోలేకపోవడం సర్వసాధారణం.
Also Read: చెమటతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ మీ కోసమే
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ?
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ ప్రకారం.. చాలా మంది లివర్ డ్యామేజ్ యొక్క ప్రారంభ లక్షణాలను పట్టించుకోరు. ఇవి ఇతర సాధారణ అనారోగ్య సమస్యలను పోలి ఉంటాయి. లివర్ సమస్యలు తీవ్రమైన తర్వాత మాత్రమే గుర్తించబడతాయి.
మీరు అలసట, కడుపు నొప్పి, అవయవాలు పసుపు రంగులోకి మారడం, వాంతులు లేదా ఆకలి లేకపోవడం వంటి లక్షణాలను కనిపిస్తే… మాత్రం మీరు వెంటనే మీ డాక్టర్ ను సంప్రదించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.