Vitamin-D: శరీరానికి విటమిన్-డి ఎంతో అవసరం. ఎముకలను బలంగా ఉంచడంతో పాటు ఇమ్యూన్ పవర్ పెంచేందుకు కూడా ఇది సహాయపడుతుంది. కండరాల పనితీరు, నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా హార్మోన్ల పనితీరును మెరుగు పర్చడంలో కూడా విటమిన్-డి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే శరీరంలో విటమిన్-డి పెరిగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
శరీరంలో విటమిన్-డి అధికంగా ఉంటే విటమిన్-డి టాక్సిసిటీ వస్తుందట. దీన్ని హైపర్విటమినోసిస్-డి అని కూడా పిలుస్తారట. కన్ని సార్లు విటమిన్-డి సప్లిమెంట్లను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్-డి అధికంగా ఉండటం వల్ల కలిగే ప్రధాన సమస్య ఏమిటంటే ఇది ప్రేగులలో కాల్షియం అబ్సార్ప్షన్ పెంచుతుందట. దీంతో రక్తంలో కాల్షియం లెవెల్స్ విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని హైపర్ కాల్సెమియా అని పిలుస్తారు. దీని వల్ల వికారం, వాంతులు, బలహీనత, వచ్చే ఛాన్స్ ఉందట. కాల్షియం పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
విటమిన్-డి ఎక్కువగా ఉండటం వల్ల గుండె పనితీరుపై కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక కాల్షియం స్థాయిల వల్ల అరిథ్మియా వస్తుందట. దీని వల్ల గుండె కొట్టుకోవడంలో వేగం పెరిగే ఛాన్స్ ఉంది.
ALSO READ: వీటితో కిడ్నీ స్టోన్స్ సమస్య దూరం
విటమిన్-డి సైడ్ ఎఫెక్ట్స్:
రక్తంలో కాల్షియం లెవెల్స్ పెరిగితే ఎముకలను బలంగా ఉంచే వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందట. మరికొందరిలో విటమిన్-డి ఎక్కువైతే అలసట లేదా బలహీనత వంటివి వస్తాయట. కొన్ని సార్లు దీని వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఏం చేస్తే సేఫ్:
విటమిన్-డి డెఫీషియేన్సీతో ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది క్యాప్సూల్స్ వేసుకుంటారు. విటమిన్-డి విపరీతంగా పెరగకుండా ఉండాలంటే వీరు మోతాదుకు మించి క్యాప్సూల్స్ తీసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి లేదా ఇతర కారణాల వల్ల విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకుంటుంటే బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అంటున్నారు.
సూర్యకాంతి నుండి విటమిన్ డి పొందడం మంచిదే. అయినప్పటికీ, ఎక్కువ సమయం ఎండలో ఉంటే విటమిన్-డి అవసరమైన దాని కంటే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే వీలైనంత వరకు చర్మంపై సూర్యరష్మి నేరుగా పడకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.