ఒక గదిలో పదిమంది ఉంటే అందులో ఇద్దరు ముగ్గురుని మాత్రమే దోమలు పదేపదే వచ్చి కుడుతూ ఉంటాయి. మిగతా అందరూ ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆ ముగ్గురు మాత్రం దోమలను తరుముకుంటూ ఉంటారు. ఇలా కొంతమందిని దోమలు టార్గెట్ చేసి కుట్టడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి అధ్యయనం నిర్వహించారు. దానిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
దోమల్లో ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. ఎందుకంటే వాటికి మన రక్తం అవసరం. అలాగని ఆడ దోమలు ఎవరిని పడితే వారిని కుట్టవు. అవి తనకు కావాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకొని మరీ కుడతాయి. అందుకోసం వారి శరీరం నుంచి వాసనను ట్రాక్ చేస్తాయి. అలాగే కార్బన్ డైయాక్సైడ్ వాసనను కూడా గమనిస్తాయి. వాటి ద్వారానే ఆడ దోమలు ఒక పరిస్థితి ఎంపిక చేసి కుడతాయి.
కొంతమంది దోమల అయస్కాంతాల్లా ఉంటారు. దోమలు వారినే పదేపదే కుడతాయి. వారి రక్త రకం, రక్తంలో చక్కెర శాతం లేదా వెల్లుల్లి వాసన రావడం, అరటిపండు తిన్న వెంటనే ఆ వాసనకి దోమలు కుట్టడం జరుగుతాయని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. కానీ వీటికి శాస్త్రీయమైన రుజువు ఇంతవరకు దక్కలేదు.
ఎందుకు కుడతాయి?
అయితే కొత్త అధ్యయనం ప్రకారం మాత్రం చర్మంపై ఉండే కొవ్వు ఆమ్లాలు అధిక మొత్తంలో ఉంటే అవి దోమలను ఆకర్షిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాంటివారినే దోమలు అధికంగా కుడతాయని ది రాక్ ఫెల్లర్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ వివరించారు. ఈ విషయాన్ని తేల్చేందుకు పరిశోధకులు మూడేళ్లపాటు అధ్యయనాన్ని నిర్వహించారు. 8 మందిని ఎంపిక చేసుకొని కొన్ని రోజులపాటు వారిపై అధ్యయనాన్ని నిర్వహించారు.
ప్రతిరోజు ఆరు గంటల పాటు వారి చేతులపై నైలాన్ తో తయారు చేసిన వస్త్రాన్ని ధరించమని చెప్పారు. కొన్ని రోజులకు ఆ నైలాన్ స్టాకింగ్‌లు అరిగిపోయాయి. అరిగిపోయిన నైలాన్ వస్త్రాలను పరీక్షించారు. వాటిని దోమల దగ్గర పెట్టి పరిశోధన నిర్వహించారు. ముఖ్యంగా జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికెన్ గునియా వంటి వాటి వ్యాప్తిక కారణమయ్యే దోమలు ఉన్న గదిలోని ఈ నైలాన్ వస్త్రాలను ఉంచారు. ఈ నైలాన్ వస్త్రం వైపు అధికంగా ఏ దోమలు ఆకర్షితులవుతున్నాయో గుర్తించారు.
ఆ నైలాన్ వస్త్రానికి అతుక్కున్న చర్మ నూనెలో ఎక్కువగా 50 రకాల సమ్మేళనాలు బయటపడ్డాయి. అంటే ఆ వ్యక్తుల నుంచి ఎక్కువ స్థాయిలో కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఉత్పత్తి అయ్యాయని గుర్తించారు. అంటే చర్మ బ్యాక్టీరియా మానవుల్లో ఒక ప్రత్యేకమైన శరీర దుర్వాసనను సృష్టిస్తుంది. ఆ వాసన దోమలను ఆకర్షిస్తుంది. వారే దోమల అయస్కాంతాలుగా మారిపోతారు. ఎంతమంది ఉన్నా కూడా ఈ కార్బాక్సిలిక్ ఆమ్లం వాసన వీచిన వారి వైపే దోమలు ఎక్కువగా వెళ్లి కుడుతూ ఉంటాయి.
దోమలకు వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అది తమకు కావలసిన మనుషులను లక్ష్యంగా చేసుకుంటాయి.
దోమలకు దూరంగా ఇలా..
దోమలు కుట్టకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు పొడవాటి చేతులు, ప్యాంట్లు వంటివి ధరించాలి. బురద ప్రదేశాల వైపు వెళ్ళకూడదు. అలాగే మీ దుస్తుల నుంచి ఎక్కువ వాసన రాకుండా జాగ్రత్త పడాలి. దోమలు కార్బన్ డైయాక్సైడ్ వంటి వాసనలకు ఆకర్షితులవుతాయి. కాబట్టి దుస్తులపై పెర్ఫ్యూమ్స్ వేసుకోవడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ వాసనను తగ్గించుకోవచ్చు. కొన్ని కీటక వికర్షకాలు కూడా దోమలను పారదోలెందుకు ఉపయోగపడతాయి. అలాంటి కీటక వికర్షణ క్రిమిలను తీసుకొని మీ దుస్తులకు రాసుకోవడానికి ఉపయోగించండి.
చర్మంపై ప్రతిరోజూ వీటిని రాయడం మంచి పద్ధతి కాదు. అలాగే ఇంటి చుట్టుపక్కల నీరు నిలవ లేకుండా చూసుకోండి. దోమలు సాయంత్రము, రాత్రి సమయంలో ఎక్కువ చురుగ్గా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో బయట తిరగకుండా ఇంట్లోనే ఉండడం ఉత్తమం. ఆయుర్వేదం ప్రకారం వేప నూనె, లెమన్ యూకలిప్టస్ నూనె, లావెండర్ ఆయిల్ వంటివి దోమలను పారదోలెందుకు ఉపయోగపడతాయి. కాబట్టి అవి చర్మానికి పట్టేందుకు అప్లై చేసుకునే ఉండడం మంచిది. అలాగే ఇంట్లో అరటి తొక్కను కాల్చడం ద్వారా కూడా దోమలను బయటికి పంపించవచ్చు.