BigTV English

Instant Coffee: ఇన్స్టెంట్ కాఫీ త్వరగా సిద్ధమైపోతుంది నిజమే, కానీ దాన్ని తాగడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ

Instant Coffee:  ఇన్స్టెంట్ కాఫీ త్వరగా సిద్ధమైపోతుంది నిజమే, కానీ దాన్ని తాగడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ

ఇనిస్టెంట్ కాఫీ అంటే అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో రెడీ అయిపోయేది. దీన్ని తయారు చేయడం చాలా సులువు. వేడి పాలలో కాఫీ పొడిని వేసి బాగా మరిగించి పంచదార కలుపుకొని తాగేయడమే. దీన్ని చేయడం చాలా సులువు కాబట్టి అందరూ ఇన్స్టెంట్ కాఫీని తయారు చేయడానికి ఇష్టపడుతున్నారు. కాఫీ పొడి మార్కెట్లో రెడీగా దొరుకుతుంది. ఇలాంటి ఇన్స్టెంట్ కాఫీ తాగడం వల్ల శరీరానికి హానికరం అని చెప్పలేము కానీ ఆరోగ్యకరమైన పానీయం మాత్రం కాదు. అంతే కాదు ఇన్స్టెంట్ కాఫీని అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.


ఇన్స్టంట్ కాఫీని అధికంగా తీసుకుంటే గుండె కొట్టుకునే రేటు పెరిగిపోతుంది. గుండె దడ లాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా కూర్చోలేరు, పడుకోలేరు. నాడీ వ్యవస్థ కూడా సున్నితంగా మారిపోతుంది. దీనివల్ల చేతుల్లో వణుకు వంటివి వస్తాయి. నిద్రా సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్స్టెంట్ కాఫీని అధికంగా తాగితే హృదయ నాళ వ్యవస్థ, జీర్ణాశయాంతర పేగుల్లో సమస్యలు ఎక్కువైపోతాయి. అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇన్స్టెంట్ కాఫీ కి దూరంగా ఉండటమే మంచిది.

ఇప్పుడు ఇన్స్టంట్ కాఫీలో కూడా అనేకమైన ఫ్లేవర్లు వస్తున్నాయి. అంటే వాటిలో ఇతర పదార్థాలను కలిపి మరింత రుచిగా ఉండేందుకు తయారు చేస్తున్నారు. ఈ కాఫీ వల్ల కలిగే ఉపయోగాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. అందుకే దీన్ని కాఫీ అనే బదులు కాఫీ పానీయం అని పిలవాలని చెబుతున్నారు. కాఫీ పానీయమంటే అందులో ఇతర పదార్థాలు కూడా కలిసినది అని అర్థం.


ఇన్స్టెంట్ కాఫీ ఎందుకు తాగకూడదు?
ఇన్స్టెంట్ కాపీ ఎందుకు మంచిది కాదో నిపుణులు వివరిస్తున్నారు. ప్రాసెసింగ్ చేసే సమయంలో కాఫీ గింజల నుండి కాఫీ పొడి వేరు చేస్తారు. ముడి పదార్థాన్ని ప్రాసెస్ చేసినప్పుడు అందులో ఉండే నూనెలు, విటమిన్లు, ఇతర పోషకాలు కూడా బయటకు పోతాయి. దీనివల్ల మిగిలిన కాఫీ పొడిలో ఎలాంటి పోషకాలు ఉండే అవకాశం తక్కువ. ఇన్స్టెంట్ కాఫీ అనేది కేవలం ఒక పానీయంగా చెప్పుకోవాలి. కానీ దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఏమీ ఉండవు.

కాబట్టి ఇన్స్టెంట్ కాఫీకి బదులుగా కాఫీ గింజలను కొని ఇంట్లోనే కాఫీ తయారు చేసుకుని తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అయితే కాఫీని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. భోజనం తర్వాత కాఫీ తాగడం మంచి పద్ధతి కాదు. రోజులో 1 లేదా రెండు సార్లు మాత్రమే కాఫీని తాగాలి. అంతకుమించి తాగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీరం వణికిపోయే సమస్య వస్తుంది. హృదయ స్పందన రేటు కూడా ఇబ్బంది పెడుతుంది.

ఇన్స్టెంట్ కాఫీ మంచిదా? కాదా అంటే దాన్ని నేరుగా చెప్పలేము. అది వారి వ్యక్తిగత అవసరాలు ఆరోగ్య పరిస్థితిలపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. సాధారణ కాఫీతో పోలిస్తే ఇన్స్టెంట్ కాఫీలో పోషకాలు మాత్రం తక్కువగా ఉంటాయి. కాకపోతే దీని త్వరగా, సులభంగా తయారు చేయొచ్చు. అలాగే దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక నష్టాల విషయానికొస్తే ఇన్స్టెంట్ కాఫీ ఇంతకడం వల్ల శరీరానికి అంతే పోషక విలువలు చాలా తక్కువ. ముఖ్యంగా దీనిలో కెఫిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తాగితే మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి మానసిక సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఇన్స్టెంట్ కాఫీని రోజుకి ఒకటి లేదా రెండు కప్పులకు పరిమితం చేయడం ఉత్తమం.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×