BigTV English

Vande Bharat Train: మరింత స్పీడుగా వందే భారత్ స్లీపర్ రైల్.. బుల్లెట్ రైలు అక్కర్లేదు

Vande Bharat Train: మరింత స్పీడుగా వందే భారత్ స్లీపర్ రైల్.. బుల్లెట్ రైలు అక్కర్లేదు

Vande Bharat Train: అసలే టెక్ యుగం.. వేగంగా అడుగులు వేయకుంటే వెనుకబడి పోతామని భావిస్తుంటారు. కేవలం పనులు మాత్రమే కాదు, ప్రయాణాలు అదే జోరు కొనసాగితే బాగుంటుందని భావిస్తున్నారు. ప్రజల ఆలోచన విధానాలకు తగ్గట్టుగా అడుగులు వేస్తోంది ఇండియన్ రైల్వే.


తాజాగా ప్రయాణికులకు శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వే. వచ్చేనెల(జులై)లో పట్టాల కెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించ నున్నాయి.  ఇది ముమ్మాటికీ నిజం. ఆ విధంగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.  స్లీపర్ వందే భారత్ రైలు ప్రయాణికులకు ఊహించని తీపి కబురు. ఇకపై రైళ్లలో ప్రయాణికుల అనుభవం మారబోతోంది.

రైల్వే ప్రయాణికులు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన సెమీ హై స్పీడ్ వందే భారత్ స్లీపర్ రైలు‌లో ప్రయాణాన్ని ఆస్వాదించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 30 వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ శాఖ. జూలై చివరి నాటికి మొదటి రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది.


ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైలు స్పీడ్ ట్రయల్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని రైల్వే అధికారులు స్వయంగా వెల్లడించారు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్-RDSO లక్నో విభాగం సాంకేతికత, వేగానికి సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసింది. ఆయా రైలు రూట్, ఛార్జీలను రైల్వే బోర్డు రేపో మాపో నిర్ణయించనుంది.

ALSO READ: నో ఆక్సిజన్.. నో ఇంటర్నెట్, అయితేనేమి అందరూ ఈ గ్రామానికే

ఈ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జులై నెలలో వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నారు. ఈ ఏడాది అంటే 2025-26లో 30 వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ-PSU భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్-BEML బెంగళూరులో 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్దమయ్యాయి.

తొలి రైలుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మిగతా రైళ్లను దశలవారీగా పట్టాలపైకి తెస్తామని చెబుతున్నారు. అలాగే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ-ICFలో 8 నుంచి 10 వరకు ఈ రైళ్లను తయారు చేస్తున్నామని వివరించారు. BEML-ICF సంయుక్తంగా ఈ రైళ్ల కోచ్‌లను తయారు చేస్తోంది.

తదుపరి రానున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను 160 నుండి 240 కిలోమీటర్ల వేగంగా రానున్నాయి. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, వందే భారత్ (చైర్ కార్) వంటి రైళ్లు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న విషయం తెల్సిందే. రాబోయే రైళ్లు అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతికతతో రానున్నాయి. అలాగే స్పీడ్ కూడా 160 ప్లస్ ఉండనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

వందే భారత్ స్లీపర్ రైలు ప్రధానంగా ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై నడిపే ఛాన్స్ ఉందని రైల్వే వర్గాల మాట.  ప్రస్తుతం ఉన్న  రైల్వే లైన్లను హై స్పీడ్‌గా మార్చడానికి ఉపయోగించాల్సిన టెక్నాలజీ,  భద్రతా చర్యలు తీసుకుంటోంది ఆ శాఖ. ఈ లెక్కన దేశంలో బుల్లెట్ రైలు అవసరం పెద్దగా ఉండదని  కొందరిమాట.  ప్రస్తుతం ఇప్పుడు 12 గంటల దూరాన్ని కేవలం నాలుగు గంటల్లో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

Related News

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Big Stories

×