హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో పెద్దలను గౌరవించడం ముఖ్యం. వారి పాదాలను తాకి నమస్కరించడం అనేది ఎంతో పవిత్రమైనదిగా చెబుతారు. ఎవరైనా పెద్దవారికి కాలికి నమస్కరించకపోతే వారిని తిట్టేవారు కూడా ఉన్నారు. కానీ పొరపాటున కూడా కొంతమంది పాదాలను తాకకూడదు అని హిందూ ధర్మం చెబుతోంది. వారి పాదాలను తాకడం వల్ల పుణ్యానికి బదులు పాపాన్ని మూటకట్టుకుంటారని వివరిస్తోంది. ఎవరి పాదాలను తాకి నమస్కరించకూడదో తెలుసుకోండి.
ఆలయంలో ఉన్నప్పుడు
మతపండితులు చెబుతున్న ప్రకారం మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పెద్దవారిని కలవడం, గొప్ప వ్యక్తులని కలవడం వంటివి చేస్తారు. ఆ సమయంలో కొంతమంది తెలియక వారి పాదాలను తాకి నమస్కరిస్తారు. ఆలయంలో ఉన్నప్పుడు ఎవరి పాదాలను తాకి నమస్కారం చేయకూడదు. ఒక మతపరమైన ప్రదేశంలో దేవుడు మాత్రమే ఉత్తముడు. అతడిని మించిన వారు లేరు. అతని సమక్షంలోనే మీరు వేరొకరి పాదాలను తాకితే అది దేవుడిని అవమానించినట్లే.
మావయ్య పాదాలను
పౌరాణిక నమ్మకాలు చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి తనకు మేన మామ వరస అయ్యే వారి పాదాలను తాకకూడదు. శ్రీకృష్ణుడు తన మేనమామ అయినా కంసుడిని చంపాడు. అప్పటినుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. కాబట్టి మీకు మేనమామ ఉంటే వారి పాదాలను తాకి నమస్కరించడం పూర్తిగా మానేయండి.
కన్యను తాకనివ్వకండి
శాస్త్రాల ప్రకారం కన్యగా ఉన్న అమ్మాయి దేవతా స్వరూపంతో సమానం. అలాంటి కన్యగా ఉన్న అమ్మాయిని మీ పాదాలను తాకి నమస్కారం చేయకుండా అడ్డుకోండి. కొంతమంది అమ్మాయిలు తెలియక తమకన్నా పెద్దవారికి నమస్కారం చేస్తారు. ఆమె కన్య అయితే మీకు నమస్కారం చేయకూడదు. ఆమె చేత మీ పాదాలను తాకనివ్వకూడదు. ఇలా చేయడం ద్వారా మీరు పాపం మూట కట్టుకున్న వారు అవుతారు. మీరు చేసిన మంచి పనులు కూడా కరిగిపోతాయి.
నిద్రపోతున్న వ్యక్తి
సనాతన ధర్మం చెబుతున్న ప్రకారం నిద్రలో ఉన్న వ్యక్తి పాదాలను తాకడం పూర్తిగా నిషిద్ధం. పడుకున్న స్థితిలో ఉన్న వ్యక్తి మరణించిన వ్యక్తిలా కనిపిస్తారు. అటువంటి పరిస్థితుల్లో నిద్రపోతున్న వ్యక్తి పాదాలకు మీరు నమస్కారం చేస్తున్నారంటే అతన్ని మీరు చనిపోయిన వ్యక్తిగా భావిస్తున్నారని అర్థం. ఇది చాలా తప్పు. కాబట్టి ఎవరైనా నిద్ర వస్తున్న సమయంలో వారి పాదాలకు నమస్కరించడం వంటి పనులు చేయకండి.
పిల్లనిచ్చిన మామకు
వేదాల ప్రకారం అల్లుడు తనకు పిల్లనిచ్చిన మామ గారి పాదాలను తాకడం నిషిద్ధం. సతీ దేవి యాగంలో తనను తాను దహనం చేసుకున్న తర్వాత శివుడు ఎంతో కోపంగా ఉంటాడు. ఆ కోపంలో తనకు పిల్లనిచ్చిన మామ అయిన దక్షుడి తలని నరికేస్తాడు. ఆ రోజు నుంచి ఈ నియమం అమలులోకి వచ్చింది. అప్పటి నుండి అల్లుడు తనకు పిల్లనిచ్చిన మామ గారి పాదాలను తాకడం పూర్తి తప్పుగా భావించడం మొదలుపెట్టారు.