వానాకాలంలో దుస్తులు త్వరగా ఆరవు. దీనివల్ల బట్టలు ఒక రకమైన దుర్వాసన వస్తాయి. ఆరుబయట ఆరబెడదాం అంటే.. వర్షం వచ్చేస్తుంది. కాబట్టి ఇంట్లోనే ఆరబెట్టాలి. కానీ ఇంట్లో బట్టల నుంచి వచ్చే దుర్వాసనను భరించలేము. కాబట్టి వర్షాకాలంలో ఇలాంటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
నిమ్మరసంతో ఇలా
దీనికోసం మీరు ముందుగా ఒక స్ప్రే బాటిల్ లో మీరు నిమ్మరసం వేసి బాగా కలపండి. దుస్తులను ఆరబెట్టాక ఆ నీటిని దుస్తులపై స్ప్రే చేయండి. దీనివల్ల ఆ దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. నిమ్మరసం మంచి ఆహ్లాదకరమైన వాసనను అందిస్తుంది.
వెనిగర్ చిట్కా
వెనిగర్ లో కూడా దుర్వాసనకు కారణం అయ్యే గుణాలు ఉంటాయి. ఆ వైరస్ లను చంపే లక్షణం ఉంటుంది. కాబట్టి బట్టలు ఉతికేటప్పుడే నీటిలో కాస్త వెనిగర్ వేసి ఉతికితే మంచిది. లేదా బట్టలు ఆరేసిన తర్వాత వెనిగర్ ను స్ప్రే చేయండి. మీకు చాలా వరకు దుర్వాసన పోతుంది.
వానాకాలంలో ఎండిన బట్టలను మడతపెట్టి వార్డ్ రోబ్ రూపంలో పెట్టాక కూడా వాసన వస్తూనే ఉంటుంది. వాతావరణంలో తేమ వల్ల ఆ బట్టలు అలా వాసన వస్తాయి. కాబట్టి వార్డురోబుల్లో బేకింగ్ సోడాను చల్లి అప్పుడు దుస్తులను సర్దండి. అప్పుడు మీకు ముక్కి వాసన రాకుండా ఉంటాయి.
బట్టలు పూర్తిగా ఆరకపోతే విపరీతమైన వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బట్టలు పూర్తిగా పొడిగా ఆరాకే మడత పెట్టండి. బట్టలను ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకండి. కేవలం పావుగంట పాటు నానబెట్టి తర్వాత ఉతికి ఆరేయడమే మంచిది. లేకుంటే దుస్తులు పాడయ్యే అవకాశం ఉంది. అలాగే ఏ రోజు బట్టలు ఆరోజు ఉతికితే దుర్వాసన రాకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు వాటిని నిల్వ ఉంచడం వల్ల కూడా ఉతికిన తర్వాత దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.
చాలామంది వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికిన తర్వాత వెంటనే ఆరవేయరు. ఖాళీగా ఉన్నప్పుడు ఆరవేద్దామని ఊరుకుంటారు. దీని వల్ల కూడా దుస్తులు నుంచి దుర్వాసన ఎక్కువగా పెరిగిపోతుంది. ముఖ్యంగా వానాకాలంలోనే ఈ దుర్వాసన అధికంగా వస్తుంది. కాబట్టి వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతికేసిన వెంటనే ఆరవేయడం మంచిది.
వానాకాలంలో దుస్తులు నుంచి ఆ దుర్వాసన రాకుండా ఉండాలంటే వార్డ్ రోబ్ మూలల్లో కచ్చితంగా నాఫ్తలీన్ ఉండలను వేయండి. నివల్ల బట్టలకు మంచి సువాసన వస్తుంది.తలుపులు ఓపెన్ చేయగానే దుర్వాసన రాకుండా ఉంటాయి.
ఎండాకాలంలో తక్కువ స్థలంలో ఎక్కువ బట్టలను ఆరేసినా ఫర్వాలేదు.కానీ వానాకాలంలో మాత్రం ఒక్కొక్క డ్రెస్సుకు గాలి తగిలేలా కొంత స్థలం ఉండేలా చూసుకోండి.ఒకదానిపై ఒకటి వేయడం వంటివి చేయకండి. దానివల్ల దుర్వాసన ఇంకా పెరిగిపోతుంది. వర్షం పడినప్పుడు ఇంట్లో ఫ్యాన్ కిందే బట్టలు ఆరనివ్వాలి. వర్షం ఫ్యాన్ వేయకుండా ఉంచితే అది ఇంకా దుర్వాసన పట్టేస్తాయి.