Rishabh Pant : భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ) గాయంతో ఐదో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. తన కుడి కాలుకు ఫ్యాక్చర్ కావడంతో ఐదో టెస్టులో పంత్ ఆడడం లేదని తెలిపింది. అతడి స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్
బ్యాటర్ జగదీశనన్ను ఎంపిక చేశారు. నాలుగో టెస్టులో తొలి రోజు బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ గాయపడిన సంగతి తెలిసిందే. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించగా, బంతి నేరుగా పాదానికి తగిలింది. దీంతో స్టేడియంలోనే బాధతో పంత్ విలవిల్లాడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అనంతరం రెండో రోజు బరిలోకి దిగిన రిషబ్ గాయం వేధిస్తున్నప్పటికీ అర్ధశతకం (54) చేశాడు. అయితే గాయంతో పంత్ కీపింగ్ చేయలేదు.
Also Read : IND Vs ENG : టీమిండియా పేలవ ప్రదర్శనకి కారణం వారేనా..? వేటు వేసేందుకు సిద్దమైన బీసీసీఐ..!
రిషబ్ సోషల్ మీడియా అదుర్స్
ఈ నేపథ్యంలోనే రిషబ్ పంత్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. తన పట్ల ప్రేమ చూపించిన వారందరికీ అభినందనలు తెలుపుతున్నాను. నా కోరికలకు పలు అడ్డంకులు వస్తున్నాయి. నా బలాన్ని నేను నిరూపించుకుంటాను. నా ప్రాక్చర్ తరువాత నేను మళ్లీ త్వరలోనే పున:ప్రారంభిస్తాను. నేను నెమ్మదిగా కోలుకుంటున్నాను. తాను టీమిండియా కి ఆడటం గర్వంగా ఉంది. ఎక్కువ క్రికెట్ ఆడకుండా ఎక్కువ రోజులు వేచి ఉండలేను. నేను తిరిగి త్వరలోనే వస్తాను” అంటూ ఓ నోట్ పోస్ట్ చేశారు రిషబ్ పంత్. అతడికి సబ్ స్టి ట్యూట్ వచ్చిన ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లోనూ రిషబ్ పంత్ బ్యాటింగ్ కి దిగలేదు. గాయం పెద్దది కావడంతో అతడు మ్యాచ్ నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ పేర్కొంది. గాయంతో రిషభ్ వైదొలగడం పట్ల కోచ్ గౌతమ్ గౌంభీర్ స్పందించాడు. “కాలికి గాయంతోనే పంత్ బ్యాటింగ్ చేశాడు. అతణ్ని ఎంత పొగిడినా తక్కువే. రాబోయే తరాలు ఇలాంటి ఇన్నింగ్స్ గురించి చర్చించుకుంటాయి. పంత్ మంచి ఫామ్లో ఉన్న సమయంలో ఇలా గాయపపడం చాలా దురదృష్టకరం. అతడు తొందరగా కోలుకొని త్వరగా జట్టులోకి చేరతాడని ఆస్తున్నాను. టెస్టు క్రికెట్లో రిషబ్ చాలా విలువైన ఆటగాడు” అని మ్యాచ్ ముగిసిన అనంతరం గంభీర్ పేర్కొన్నాడు.
శభాష్ రిషబ్ పంత్..
మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. రవీంద్ర జడేజా (107 *), వాషింగ్టన్ సుందర్ (101*) అసాధారణ ఆటతో మ్యాచ్ ని గట్టెక్కించారు. అంతకుముందు శుభ్ మన్ గిల్ (103) శతకం బాదగా.. కేఎల్ రాహుల్ (90) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ
మ్యాచ్ డ్రాతో ప్రస్తుతం 2-1 తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. ఐదో టెస్టు ఈనెల 31న లండన్లోని ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తేనే సిరీస్ ను 2-2 తేడాతో ముగించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ఇంగ్లాండ్ విజయం సాధిస్తే.. టీమిండియా సిరీస్ కోల్పోతుంది. అలాగే పాయింట్ల పట్టికలో కూడా వెనుకంజలోకి వెళ్తుంది. ఒకవేళ విజయం సాధిస్తే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో కూడా కాస్త మెరుగు అవుతుంది. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతను టీమిండియా తరపున మొన్న ఆడిన ఇన్నింగ్స్ చూసి అందరూ శభాష్ అంటున్నారు. కాలికి గాయం అయినప్పటికీ హాప్ సెంచరీ చేసి అందరితో ప్రశంసలు అందుకున్నాడు పంత్.