Pawan kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రానుండడంతో ఆడియన్స్ తోపాటు పవన్ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ని ఎప్పుడు ఎప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు రాజకీయాల్లో తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తూనే.. మరోవైపు ఇప్పటికే అంగీకరించిన సినిమాలు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నారు పవన్. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్ లను పవన్ పూర్తి చేశారు. అందులో వీరమల్లు రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఓజీ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
క్లైమాక్స్ ను కంప్లీట్ చేసిన ‘ఉస్తాద్ ‘..
ఓజీ మూవీని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం సెట్స్ లోకి ఆయన అడుగుపెట్టినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. పవన్ తోపాటు ఇతర కీలక పాత్రధారులు షూటింగ్ కు హాజరైనట్లు తెలిపారు. ఇప్పుడు పవన్ పెండింగ్ పెట్టిన ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం మిగిలి ఉంది. కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఆ సినిమా గురించి పవన్ ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మొన్న సినిమాను ఐదు రోజుల్లో పూర్తి చేస్తాను అని టీమ్ వెల్లడించారు. తాజాగా మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు సోషల్ మీడియా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ అప్పుడే అయిపోయిందా అంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Also Read : అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్న సుజిత్.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రిలీజ్ అప్పుడేనా..?
ఏపీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు దూరంగా ఉన్నాడు. మళ్లీ కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేస్తున్నాడు. కొద్ది రోజులుగా కాల్ షీట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలను పూర్తి చేస్తున్నాడు. వరుస కాల్ షీట్స్ ఇవ్వడంతో హరీష్ శంకర్.. జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సినిమా.. డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అవుతుందని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు.జులైలో వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడికి కరెక్ట్ గా రెండు నెలల తర్వాత దసరా కానుకగా ఓజీ సినిమా సందడి చేయనుంది. ఈ మూవీ రిలీజ్ అయిన రెండు మూడు నెలలకే ధీన్ని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
#UstaadBhagatSingh completes shooting for climax ❤️🔥
An electrifying climax high on emotions and action was wrapped up under the supervision of #NabaKanta master. pic.twitter.com/BWkGFtL5PN
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) July 29, 2025