రక్తహీనత ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. శరీరం సరైన రీతిలో పనిచేయాలంటే ఆక్సిజన్ ఎంతో అవసరం. అలాగే ప్రతి అవయవానికి పోషకాలు అందాల్సిన అవసరం ఉంది. ఆక్సిజన్, పోషకాలు… ప్రతి కణానికి అందాలంటే రక్తం అవసరం. ఆరోగ్యకరమైన రక్త ప్రవాహం అన్ని అవయవాలను కాపాడుతుంది. రక్తం తక్కువగా ఉంటే కొన్ని అవయవాలకు సరిగా పోషకాలు, ఆక్సిజన్ అందవు. కాబట్టి మీరు రక్తహీనత సమస్య నుంచి త్వరగా బయటపడాల్సిన అవసరం ఉంది.
రక్తహీనత ఉన్న వారిలో తక్కువ ఎర్ర రక్తకణాలు ఉంటాయి. అలాగే హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి. దీనివల్ల అలసట, తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఇంట్లోనే కొన్ని రకాల పానీయాలు తాగడం ద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. దీనికి మందులు వాడాల్సిన అవసరం లేదు.
బీట్రూట్ జ్యూస్
బీట్రూట్లో ఇనుము కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా రక్తం పెరుగుతుంది. బీట్రూట్లో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి అవసరమైన విటమిన్ బి9. దీనినే ఫోలేట్ అని పిలుస్తారు. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచే నైట్రేట్లను కలిగి ఉంటుంది. బీట్రూట్ రసం తయారు చేయడానికి తాజా దుంపలను తీసుకోవాలి. అందులో కొద్దిగా నీరు, నిమ్మకాయ పిండి మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత దాన్ని వడకట్టి తాగేయాలి. ప్రతిరోజు అర గ్లాస్ తాగండి చాలు. కొన్ని రోజుల్లోనే మీరు రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు.
పాలకూర, కాలే..
పాలకూరతో కూడా రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు. కాలే అనే ఆకుకూర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూర, కాలే.. ఈ రెండిట్లో కూడా ఐరన్, పోలేట్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. పాలకూర, కాలేను తీసుకొని నారింజ, బెర్రీలు వంటి పండ్లతో కలపండి. అన్నిటినీ సన్నగా తరిగి స్మూతీ లాగా చేసుకోండి. మిక్సీలో వేసి రుబ్బితే మెత్తని స్మూతీ రెడీ అయిపోతుంది. దీన్ని తింటే టేస్టీగా ఉంటుంది. పైగా దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరం ఆహారం నుంచి ఇనుమును అధికంగా శోషించుకుంటుంది.
దానిమ్మలు
దానిమ్మ పండ్లలో ఇనుము, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనత సమస్యను తొలగిస్తాయి. దానిమ్మలో ఇనుము కంటెంట్ ఎక్కువ. కాబట్టి ప్రతిరోజూ ఒక పండు తిన్నా చాలు. మీలో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దానిమ్మ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తాజా దానిమ్మ గింజలను నీటిలో వేసి మెత్తగా రుబ్బుకోవడానికి ప్రయత్నించండి. వాటిని వడకట్టి ఆ జ్యూస్ ని తాగేయండి. స్వచ్ఛమైన దానిమ్మ రసం కావాలంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలి.
క్యారెట్, ఆపీల్ కలిపి..
క్యారెట్, ఆపిల్ కలిపి కూడా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంట్లోనే అల్లం జ్యూస్ కూడా ఉత్తమంగా పనిచేస్తుంది. అల్లం జ్యూస్ లో పసుపును కలుపుకొని తాగితే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి పెరుగుతుంది. అల్లం ఇనుము శోషణు ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఒక టీ స్పూన్ పసుపు పొడి, ఒక టీ స్పూన్ తాజాగా తురిమిన అల్లాన్ని తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేయండి. ఆ నీటిని ఒక గిన్నెలో వేసి గోరువెచ్చగా వేడి చేయండి. ఇప్పుడు దానిలో తేనే లేదా నిమ్మరసం కలుపుకుని తాగేయండి.
నిమ్మరసం
నిమ్మ రసం, తేనె కలిపి తాగితే ఎంతో ఆరోగ్యం. నిమ్మకాయను గ్లాస్ నీటిలో పిండి అందులో ఒక స్పూన్ తేనె కలుపుకొని ప్రతిరోజు తాగేందుకు ప్రయత్నించండి. వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. శరీరం ఆహారం నుండి ఇనుమును అధికంగా శోషించుకుంటుంది. కాబట్టి రక్తహీనత సమస్య నుంచి త్వరగా బయటపడతారు. ప్రతిరోజు ఈ పైన చెప్పిన ఆ పానియాలలో ఏదో ఒకటి తాగడం వల్ల మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Also Read: భార్య తన భర్తతో ఇలా ప్రవర్తించిందంటే.. తన సంసారంలో తానే నిప్పులు పోసుకున్నట్టు, జాగ్రత్త!