ప్రస్తుత కాలంలో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్లు చేసుకున్న కొన్ని నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఒకరినొకరు గౌరవించుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తున్నట్లు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ సంబంధంలోనైనా గౌరవం చాలా ముఖ్యం. ఎవరైతే భాగస్వామిని గౌరవించరో, దురుసుగా మాట్లాడతారో, వారికి విలువ ఇవ్వరో, ప్రతి చిన్న విషయానికి కోపగించుకుంటారో వారి మధ్య ద్వేషం మొదలైపోతుంది. చిన్నచిన్న విషయాలకే వారిద్దరూ తిట్టుకోవడం మొదలవుతుంది. ఇది చివరకు విడాకులకు దారితీస్తుంది. ముఖ్యంగా భార్య కొన్ని పనులు చేయడం వల్ల భర్త దగ్గర దేశానికి గురవుతుంది. వారి బంధం వీగిపోతుంది. కొన్ని నెలలకే విడిపోవచ్చు కూడా.
తల్లిదండ్రుల ముందు అవమానించడం
భార్య తన భర్తకు ఎంతో విలువ ఇవ్వాలి. తన తల్లిదండ్రుల ముందు లేదా తన బంధువుల ముందు భర్తను అవమానించకూడదు. అది జరిగితే ఆ భర్త స్వీకరించలేడు. మీ భర్త పై మీకు ఎన్ని ఫిర్యాదులు ఉన్నా కూడా ఈ పని మాత్రం చేయకండి. ఎందుకంటే అల్లుడికి తన అత్తమామల ఇంటిలో కచ్చితంగా గౌరవాన్ని పొందాలని కోరుకుంటాడు. ఆ గౌరవం పొందకపోతే తీవ్ర ఉద్వేగానికి గురవుతాడు. మీ తల్లిదండ్రుల ముందు మీరు అతనితో చులకనగా ప్రవర్తిస్తే అది మీ భర్త ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. మీతో మీ భర్త ఎక్కువ కాలం కలిసి జీవించలేడు.
అత్తగారితో అసభ్యంగా మాట్లాడడం
అత్తగారికి కోడలికి మధ్య దూరం ఎక్కువగానే ఉంటుంది. అత్తా కోడళ్లు అయిన తల్లి కూతుర్లులా మెలిగే వారు చాలా తక్కువ. అత్తగారు అనే పదం వింటేనే ఎంతోమంది కోడళ్ళు అసహ్యించుకుంటున్నారు. వారిపై విపరీతమైన ద్వేషాన్ని, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా మీ భర్త ముందు మీ అత్తగారితో అసభ్యంగా మాట్లాడకండి. ఎందుకంటే మీకు ఆవిడ అత్తగారే కావచ్చు… కానీ మీ భర్తకు మాత్రం ఆవిడ కన్నతల్లి. తల్లిని నీచమైన మాటలు మాట్లాడితే భార్యపై ఏ భర్తకు కూడా ప్రేమ రాదు.
సంపాదన గురించి చులకనగా
ప్రతి స్త్రీ తన భర్త అధికంగా సంపాదించాలని కోరుకుంటుంది. మీ భర్త తక్కువ సంపాదించితే లేదా ఆర్థిక సమస్యలు అధికంగా ఉంటే మీరు ప్రతిరోజు అతన్ని ఎగతాళి చేయడం వంటివి చేయకండి. దానికి బదులు మీ ఖర్చులను తగ్గించుకోండి. మీరు ఆర్థిక సాయం చేయండి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండిపోవు. మీ భర్త ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడవచ్చు. అప్పుడు గతంలో మీరు అన్న మాటలకు మీరు చింతించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ భర్త ఆర్థిక పరిస్థితి బాలేనప్పుడు మీరు సాయం చేయాలి. కానీ చులకనగా మాట్లాడకూడదు.
ఇలా కూడా చేయొద్దు
మీ పుట్టింటి వారు మీ భర్తని ఆహ్వానించకుండా మీ పుట్టింటికి వెళ్లమని చెప్పొద్దు. అల్లుడిని అత్తగారు ఆహ్వానిస్తేనే వెళ్లాలి. అలా ఎప్పుడు పడితే అప్పుడు అత్తగారింటికి వెళ్లే అల్లుళ్లకు విలువ ఉండదు. కాబట్టి మీరు మీ అమ్మగారి ఇంటికి పదే పదే వారిని పంపించి వారి గౌరవాన్ని తగ్గించేలా చేయొద్దు.
గొడవలు షేర్ చేయొద్దు
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, బేధాభిప్రాయాలు రావడం అనేది సహజం. కానీ కొందరు భార్యలు ప్రతి విషయాన్ని పుట్టింటి వారికి చెబుతూ ఉంటారు. ప్రతి గొడవను వారికి వివరిస్తూ ఉంటారు. ఇలా ప్రతిసారి భర్త పైన పుట్టింట్లో ఫిర్యాదు చేస్తూ ఉంటే అతనికి ఏం గౌరవం దక్కుతుంది. కాబట్టి మీ భర్త గౌరవాన్ని మీరే కాపాడాలి. ముఖ్యంగా మీ పుట్టింట్లో మీ భర్తకు మీరే గౌరవం అందేలా చూడాలి.
Also Read: 2 నిమిషాల్లోనే, తెల్లగా మెరిసిపోవాలంటే.. ఇలా చేయండి !
ప్రతిదానికి అరవకండి
కుటుంబ బాధ్యత భర్త భుజాలపైనే ఉంటుంది. కాబట్టి అతడికి ఒత్తిడి ఉంటుంది. చిరాకు పడడం వంటివి జరుగుతూ ఉంటాయి. అతను కోపంగా ఉన్నప్పుడు వాదన పెట్టుకోకండి. తిట్టడం, అరవడం వంటివి చేయకండి. ప్రతి చిన్న విషయాన్ని లాగి లాగి గొడవపడకండి. అతని కోపం చల్లారే వరకు ఉండండి. ఆ తర్వాత సమస్య గురించి అతనితో ప్రశాంతంగా మాట్లాడండి.