Group-3 Hall Tickets: ఈ నెల 17,18 తేదీల్లో తెలంగాణలో గ్రూప్-3 పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉండనుంది. అంతే కాకుండా ప్రతి పేపర్ లో 150 ప్రశ్నలు ఉండగా..ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also read: బాలయ్య ఆగ్రహం.. దేవినేని అడ్రస్ గల్లంతు!
తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇక 17వ తేదీ ఉదయం పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తుండగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12,30 గంటలకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ -2 మధ్యాహ్నం 3గంటల నుండి 5.30 వరకు నిర్వహిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా 18న ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు పేపర్-3 నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే నేడు హాట్ టికెట్లను విడుదల చేయనున్నట్టు అధికారిక వెబ్ సైట్ లో టీజీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాలను, హాల్ టికెట్లను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,388 గ్రూప్-3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాత పరీక్షలు వేగంగా నిర్వహించడంతో పాటూ ఫలితాలను సైతం అంతే వేగంగా విడుదల చేస్తున్నారనే ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.