BigTV English

copper vessel: కాపర్ బాటిల్‌లో నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

copper vessel: కాపర్ బాటిల్‌లో నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

copper vessel: ప్రస్తుతం ఉన్న కాలంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడం అనేది ఓ సవాలుగా మారింది. మారుతున్న జీవనశైలితో పాటు తినే ఆహారంలో ఉండే మార్పుల కారణంగా రోగాల పాలు కావాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా చెక్ పెట్టవచ్చు. ప్రతి రోజూ అధిక మోతాదులో నీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. అందులో ముఖ్యంగా నీటిని తీసుకునే విధానం కూడా ఉంటుంది. సాధారణమైన బాటిళ్లలో కాకుండా నీటిని కాపర్ వంటి బాటిల్స్‌లో తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు దూరం అవుతాయి.


ఈ తరుణంలో కాపర్ బాటిల్ లో దాదాపు 8 గంటల పాటు నీటిని నిల్వ చేసి తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మరోవైపు 8 గంటల కంటే ఎక్కువ సేపు ఉంచడం కూడా మంచిది కాదు. 8 గంటల పాటు నీటిని ఉంచి తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. రాగి పాత్రల్లో భోజనం చేయడం, నీళ్లు తాగడం వల్ల శరీరంలో హైబీపీ, హైకొలెస్ట్రాల్, హార్ట్ బీట్, వంటి ఎన్నో రకాల సమస్యలను అదుపు చేయవచ్చని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా గుండెకు సంబంధించిన ప్రమాదాల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం కావాలన్నా కూడా రాగి పాత్రలు తోడ్పడతాయి.

ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధులు, అంటు వ్యాధులు వంటి ఎన్నో రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. రాగి బాటిల్, వస్తువుల్లో తీసుకునే ఆహారం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. పూర్వకాలంలో చాలా మంది రాగి పాత్రల్లో తినే వారని.. ఈ పరిస్థితుల్లో చాలా మంది సరికొత్త మోడల్స్ అంటూ వాటిపై మొగ్గుచూపుతున్నారు అని నిపుణులు అంటున్నారు. రాగి అనేది శరీరానికి సరైన మోతాదులో అందకపోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి దెబ్బతింటుంది. హైపోథైరాయిడిజం వంటి వాటి బారిన పడే అవకాశాలు ఉంటాయి. రాగి సీసాల్లో నిల్వ చేసిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఏర్పడే నొప్పులు కూడా దూరం అవుతాయి.


అందువల్ల తరచూ రాత్రి వేళ రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేసుకుని ఉదయం తాగినా కూడా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటి కారణంగా కొవ్వును కరిగించే కణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ కరిగిపోయి, అధిక బరువు నుంచి ఉపశమనం కలుగుతుంది. క్యాన్సర్, జీర్ణ సమస్యలు, అల్సర్, మూత్రపిండాలు వంటి సమస్యలు ఉన్న వారిలో రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా శరీరానికి అంది అన్ని సమస్యలు తొలగిపోతాయి.

Related News

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Acidity: క్షణాల్లోనే.. అసిడిటీని తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Anemia: నిత్యం ఈ సమస్యలు వేధిస్తున్నాయా ? అయితే రక్త హీనత ఉన్నట్లే !

Diabetes In India: ఇండియాలో పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. కారణాలు ఇవే !

Big Stories

×