BigTV English

This Weekend Release Movies And Series List: వీకెండ్‌లో సినిమాల సందడి.. థియేటర్ / ఓటీటీలో రేపు ఒక్క రోజే ఎన్నంటే..?

This Weekend Release Movies And Series List: వీకెండ్‌లో సినిమాల సందడి.. థియేటర్ / ఓటీటీలో రేపు ఒక్క రోజే ఎన్నంటే..?

Weekend Theater and Ott Releases movies – web series: సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో వీకెండ్ వచ్చేస్తోంది. అయితే ఈ వీకెండ్‌లో కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ సినిమా మాత్రమే రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత సారంగదరియా వంటి చిన్న చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఎక్కువగా ‘ఇండియన్2’ సినిమాపైనే అందరి చూపు ఉంది. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.


ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 12 అంటే రేపు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో కమల్ హాసన్‌తో పాటు నటుడు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ డిఫరెంట్ లుక్స్ బాగా పాపులర్ అయ్యాయి. అంతేకాకుండా ఇదివరకే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. అందువల్లనే ఈ సినిమా చూసేందుకు సినీ ప్రియులు బాగా ఇష్టపడుతున్నారు. మరి రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇక థియేటర్ సినిమాలతో పాటు ఓటీటీలోనూ వీకెండ్ సందడి కొనసాగనుంది. పలు సినిమాలు, సిరీస్‌లు రేపు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మహారాజ’. ఒక చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సేతుపతి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా ఊహించని రెస్పాన్స్‌తో దూసుకుపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జూలై 12న అంటే రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు జిలేబి మూవీ కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు కూడా ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమయ్యాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.


Also Read: దేవర మూవీలో యానిమల్ విలన్‌

నెట్‌ఫ్లిక్స్‌

జూలై 12 – మహారాజ (సినిమా)
జూలై 12 – బ్లేమ్‌ ది గేమ్‌ (మూవీ)
జూలై 12 – ఎక్స్‌ప్లోడింగ్‌ కిట్టెన్స్‌ (కార్టూన్‌ సిరీస్‌)

ఆహా

జూలై 13 – జిలేబి (సినిమా)

హాట్‌స్టార్‌

జూలై 12 – అగ్నిసాక్షి(తెలుగు సిరీస్‌)
జూలై 12 – షో టైమ్‌ (సిరీస్‌)

జియో సినిమా

జూలై 12 – పిల్‌ (హిందీ సినిమా)

లయన్స్‌ గేట్‌ ప్లే

జూలై 12 – డాక్టర్‌ డెత్‌: సీజన్‌ 2( సిరీస్‌)

Also Read: ఆపరేషన్‌ రావణ్‌ అదుర్స్ అంటున్న మాస్ కా దాస్‌

సోనీలివ్‌

జూలై 12 – 36 డేస్‌ (హిందీ సిరీస్‌)

మనోరమ మ్యాక్స్‌

జూలై 12 – మందాకిని(మలయాళ సినిమా)

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×