New Vande Bharat: సడెన్ గా ఈ వీడియో చూసి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రోడ్డుపైకి వచ్చేసిందేంటి అనుకుంటున్నారా? కంగారు పడకండి. లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవ్వడం ఇండియన్స్ స్టైల్. మార్కెట్ లోకి ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా దానిని వివిధ విధాలుగా మార్చి వాడేస్తుంటారు. మనవాళ్ల వాడకం అలా ఉంటుంది. ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ పార్కులో పర్యాటకులను తిప్పే వాహనాన్ని వందే భారత్ ట్రైన్ ఆకారంలో రూపొందించారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ మాదిరిగా ఆ వాహనం ముందలి భాగాన్ని రూపొందించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా మార్పులు చేశారు. పార్కులోని పలు ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులను ఈ వాహనంలో తిప్పుతున్నారు. సడెన్ చూసిన వారికి వందే భారత్ రైలు రోడ్డుపైకి వచ్చేసిందా? అనిపిస్తుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. న్యూ వందే భారత్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో కోల్ కతాలోని ఓ పార్కులో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లో బడ్జెట్ వందే భారత్ అని మరికొందరు అంటున్నారు. మరికొంత మంది దేశీ వందే భారత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది వందే భారత్ కాపీ అంటున్నారు మరికొందరు.
భారత్ లో అత్యధిక వేగవంతమైన రైలుగా ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ రికార్డులకెక్కింది. ఈ రైలు గంటకు 180 కి.మీ స్పీడ్ అందుకోగలదు. ప్రస్తుతం గంటకు 160 కి.మీ వేగంతో ఈ రైళ్లను నడుపుతున్నారు. దేశంలోని ప్రధాన మధ్య ఈ రైళ్లను నడుపుతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ రైళ్లు ఎక్కువగా నడుపుతుండగా, త్వరలో స్లీపర్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read: Viral video: కారు డ్రైవర్‌కు రూ.57 వేలు ఫైన్ వేసిన పోలీసులు.. మంచి పని చేశారు, ఎందుకంటే?
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హై స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ ను డిజైన్ చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ లో భాగంగా మొదటి రైలును రూ.97 కోట్లతో 18 నెలల్లో రూపొందించారు. జనవరి 27,2019న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. తొలి వందే భారత్ రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రధాని మోదీ ప్రారంభించారు.