Jr.NTR Dragon OTT: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్(Dragon) అనే సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా పూర్తిగా తన లుక్ మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ప్రస్తుతం డ్రాగన్ పనులలో బిజీగా ఉన్నారు..
తాజాగా ఈ సినిమా ఓటీటీకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flix)భారీ ధరలను ఆఫర్ చేసినట్టు సమాచారం. 8 వారాల డీల్ తో నెట్ ఫ్లిక్స్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇలా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతనే మనం నెట్ ఫ్లిక్స్ లో చూసే అవకాశం ఉంటుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఒకింత షాక్ అవుతున్నారనే చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా థియేటర్ లో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఎనిమిది వారాలపాటు ఎదురుచూడాల్సిందేనని స్పష్టం అవుతుంది.
ఇటీవల ఎన్టీఆర్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 సినిమా కూడా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమౌతూ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం అత్యధిక వ్యూస్ సొంతం చేసుకొని వార్ 2 నెట్ ఫ్లిక్స్ లో మొదటి స్థానంలో నిలిచింది.. ఈ సినిమాతో పాటుగా రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ఒకేరోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ వార్ 2 మాత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ఆలస్యమైందని చెప్పాలి.
ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణి వసంత్
ఇలా వార్ 2 సినిమా తరహాలోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా కూడా 8 వారాల డీల్ తో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను కైవసం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఎన్టీఆర్ లేకపోయినప్పటికీ శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఎన్టీఆర్ ఇటీవల ఓ షూటింగ్ లో గాయపడిన నేపథ్యంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ లేని సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈ డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా ప్రకటించిన రోజే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ డీల్ క్లోజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అప్పుడేనా?