Suryakumar Yadav: ఆసియా కప్ 2025 టోర్నమెంటు విజేతగా టీమిండియాను నిలిపిన సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు గుళ్ళ బాట పట్టాడు. తన భార్యతో కలిసి తాజాగా ఉజ్జయిని మహంకాళి ( Ujjains Mahakal Temple ) దేవాలయాన్ని దర్శించుకున్నారు సూర్య కుమార్ యాదవ్. టి20 టీమిండియా కెప్టెన్ గా సక్సెస్ అవుతున్న సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) తాజాగా ఆసియా కప్ టోర్నమెంట్ గెలిపించాడు. ఇక ఈ సంతోషంలో భాగంగా తన కుటుంబంతో కలిసి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వెళ్లారు సూర్యకుమార్ యాదవ్. అయితే సూర్యకుమార్ గుడికి వెళ్లిన నేపథ్యంలో ఆయన భార్య దేవిషా శెట్టి ( Devisha Shetty) కొన్ని ఫోటోలు అలాగే వీడియోలు పంచుకున్నారు. ఇందులో బాలీవుడ్ మోడల్, నటి అవ్‌నీత్ కౌర్ ( Avneet Kaur ) మెరిసింది. సూర్య కుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి పంచుకున్న ఓ వీడియోలో బాలీవుడ్ నటి అవ్‌నీత్ కౌర్ స్పష్టంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
సూర్య కుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి షేర్ చేసిన వీడియోలో బాలీవుడ్ హీరోయిన్ అవ్‌నీత్ కౌర్ ఉండడంతో అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. సూర్య కుమార్ యాదవ్ కుటుంబంతో ఆమె వెళ్లిందా ? లేక ఆమె అనుకోకుండా వాళ్ళ పక్కన కూర్చుందా? దేవిషా శెట్టికి తెలియకుండా ఆ బాలీవుడ్ హీరోయిన్ ను సూర్య కుమార్ యాదవ్ తీసుకువచ్చాడా? ఇలా అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ ఎపిసోడ్ నేపథ్యంలో అవ్‌నీత్ కౌర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కుటుంబంతో కలిసి కనిపించడంతో మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అనుకోకుండా సూర్య కుమార్ యాదవ్ కుటుంబాన్ని గుళ్లో కలిసినట్లు తెలుస్తోంది. అంతేకానీ సూర్య కుమార్ యాదవ్ అలాగే అవ్‌నీత్ కౌర్ కు ఎలాంటి సంబంధం లేదని సమాచారం. కానీ కొంత మంది మాత్రం అవ్‌నీత్ కౌర్ తో సూర్యకు సంబంధం అంటగడుతున్నారు.
ఏజ్ పైబడినప్పటికీ టీమిండియా టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్ కారణంగా జట్టులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ అతి తక్కువ కాలంలోనే కెప్టెన్ అయ్యాడు. దీనికి తగ్గట్టుగానే అతడు అటాకింగ్ బ్యాటింగ్ తో రెచ్చిపోతూ ఉంటాడు. మొన్న ఆసియా కప్ 2025 విజేతగా ( Asia Cup 2025) టీం ఇండియాను నిలిపాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై ఐదు t20 లకు కూడా సిద్ధమవుతున్నాడు సూర్య కుమార్ యాదవ్.
?utm_source=ig_embed&ig_rid=32d83466-348b-43e0-aede-b30d41681904