BigTV English

Soft Roti Making: రోటీలు మెత్తగా.. దూది పింజల్లా రావాలంటే ఈ తప్పులు చేయొద్దు

Soft Roti Making: రోటీలు మెత్తగా.. దూది పింజల్లా రావాలంటే ఈ తప్పులు చేయొద్దు

రోటీలు, చపాతీలు మెత్తగా ఉంటే ఆ రుచే వేరు. రెండు వేళ్లతోనే తుంచితే చపాతీ వచ్చేలా ఉండాలి. రోటీ అయినా చపాతీ అయినా ఎంతోమందికి అవి మెత్తగా చేయడం రాదు. గట్టిగానే చేస్తారు. చపాతీలు, రోటీలు మెత్తగా చేయడం ఒక కళ అనుకుంటారు. నిజానికి చిన్న చిన్న టిప్స్ ద్వారా రోటీలు, చపాతీలను మెత్తగా చేసుకోవచ్చు. అవి మెత్తగా రావాలంటే పిండి కలిపేటప్పుడే కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి.


రోటీ, చపాతీలను రోజువారీ భోజనంలో భాగంగా తినే వారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. రోటీల రుచి, ఆకృతి బాగుండాలంటే పిండి నాణ్యత పై కూడా అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి గోధుమపిండినే దీనికి ఉపయోగించండి. అలాగే గోధుమపిండిలో మైదాను కలపడం వంటివి చేయకండి.

గోధుమ పిండిలో ఫైబర్ పోషకాలు నిండుగా ఉంటాయి. వీటితో చేసే రోటీలు మృదువుగా వస్తాయి. అలాగే గోధుమపిండి కలిపే ముందు ఒకసారి జల్లెడ పట్టండి. దీనివల్ల మృదువైన పిండి మాత్రమే జల్లెడ నుంచి కిందకి జారుతుంది. వాటితో చేసే రోటీలు చాలా మెత్తగా ఉంటాయి.


పిండి ఎలా కలపాలి?
చాలామంది రోటీల పిండి కలిపేటప్పుడు తేలికగా ఐదు నిమిషాల్లో కలిపేస్తారు. కానీ రోటి కానీ, చపాతీ కాని మెత్తగా రావాలంటే పిండి కలిపే పద్ధతి చాలా ముఖ్యం. పిండిని ఎంత బాగా పిసికితే రోటి కూడా అంత మెత్తగా వస్తుంది. అలాగే పిండిని కలిపేటప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. అలాగే పిండి కలిపిన తర్వాత వెంటనే చపాతీలు, రోటీలు చేయడం మొదలుపెట్టొద్దు. కనీసం అరగంట పాటు పక్కన మూత పెట్టి ఉంచండి. ఇది గ్లూటెన్ అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది. అప్పుడు రోటీలు మృదువుగా వస్తాయి.

రోటీలు కాల్చేటప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయకపోతే అవి మెత్తగానే వస్తాయి. చాలామంది పెనం స్టవ్ మీద పెట్టి వెంటనే చపాతీ వేసేస్తారు. అలా కాకుండా పెనం బాగా వేడెక్కాక మీడియం మంట మీదకు మార్చండి. అప్పుడు రోటీని లేదా చపాతీని వేసి కాల్చండి. అలాగే చపాతీ లేదా రోటీ వేయడానికి ముందు కొంచెం నూనెను వేయండి. రోటీని రెండు వైపులా 30 సెకండ్ల పాటు కాలిస్తే చాలు అంతకుమించి కాల్చాల్సిన అవసరం లేదు.

పిండిని ముందుగా రౌండ్ గా లడ్డూల్లా చుట్టుకోవడం మర్చిపోవద్దు. చాలామంది ఈ పని చేయరు. అలా చుట్టడం వల్ల రోటీలు వత్తేటప్పుడు చిత్రమైన ఆకృతికి వస్తాయి. అలాగే అవి కాల్చేటప్పుడు కూడా అన్ని వైపులా ఒకేసారి రోటి బాగా కాలుతుంది.

రోటిలు, చపాతీలు బాగా పొంగాలంటే దాన్ని మడతలు పెట్టండి. తర్వాత మళ్లీ రోలింగ్ పిన్ తో బాగా ఒత్తండి. అప్పుడు పూరీలాగా ఉబ్బుతాయి. అలా ఒత్తిన రోటీలు, చపాతీలు చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. తినాలన్న కోరికను పెంచుతాయి. మేము చెప్పిన పద్ధతిలో మీరు చేసి చూడండి. మీకు కచ్చితంగా మెత్తటి రోటీలు, చపాతీలు వస్తాయి.

Also Read: ఈ సూపర్ ఫుడ్స్‌తో తెల్ల జుట్టు మాయం !

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×