Bulldozer in wedding : పెళ్లి అంటే జీవితాంత గుర్తుంచుకునే రోజు. ఆ రోజును ఎవరి స్తోమతకు తగినట్లు వాళ్లు, ఎంత గ్రాండ్ గా చేసుకునేందుకు వీలుంటే అంతాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే.. కొంతమంది ఆలోచనలు భలే వింతగా, కొత్తగా ఉంటాయి. దాంతో.. ఫుల్ ట్రెండ్ అయిపోతుంటాయి. ఇటీవల యూపీలో ఓ పెళ్లి అలానే ఇంటర్నేట్ లో పావులర్ అయిపోయింది. ఎందుకంటే.. పెళ్లిల్లో ఎవరైనా మిరిమిట్లు గొలిపే లైటింగ్, చెవులకు చిల్లులుపడేలా డీజే బాక్సులు పెట్టుకుని స్పెషల్ అట్రాక్షన్ గా మిగిలిపోతుంటారు. లేదంటే.. ఉత్సవాల్లో సంప్రదాయ ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్ల నుంచి హెలీకాఫ్టర్ వరకు ఎన్నింటిలోనూ వాడుతూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కానీ యూపీలో వైరల్ అయిన ఈ పెళ్లిలో మాత్రం అలా కాదు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ కారణంగా ఫేమస్ అయిన జేసీబీ లతో ర్యాలీలా నిర్వహించి.. ప్రత్యేకంగా నిలిచారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఒక కుటుంబం.. వధువు ‘బిదాయి’ లేదా ఉత్సవ వీడ్కోలు కోసం ప్రత్యేకంగా ఆలోచించింది. ఆ ఆలోచనే వారిని ఇప్పుడు వైరల్ చేస్తోంది. ఆజాద్ నగర్ లో ఉండే.. మున్నీ లాల్ యాదవ్ చిన్న కుమారుడు రాహుల్ యాదవ్, వారికి దగ్గర్లోని గ్రామానికి చెందిన కరిష్మా అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆమెను పుట్టింటి నుంచి మెట్టినింటికి పంపించే.. ‘బిడాయి’ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించాలనుకున్నారు.
ఇందుకోసం.. వధువు, వరుడిని SUVలో కూర్చుబెట్టగా.. వారి ముందు ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు డజను బుల్డోజర్లు ఊరేగింపులోకి వచ్చేశాయి. అప్పటి వరకు సాధారణంగానే ఉన్న ఆ వేడుకలు.. బుల్డోజర్లు వచ్చి చేరే వరకు ప్రత్యేకంగా నిలిచాయి. దాంతో.. అందులో పాల్గొన్న వారంతా.. వీడియోలు, ఫోటీలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు, నేరస్థుల యాజమాన్యంలోని స్థలాల్ని కూల్చేందుకు బుల్డోజర్లు వాడుతోంది. దీంతో.. పెళ్లి వేడుకలో బుల్డోజర్లు చూసి స్థానికులు తొలుత భయపడ్డారు. కానీ.. ఆ తర్వాత బుల్డోజర్లు వివాహ వేడుకల కోసం వచ్చాయని తెలిసి ఊపిరి పీల్చుకున్నారంటా. ఈ వీడియోలు వైరల్ కావడంతో.. ఇది “బుల్డోజర్ వివాహం” అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా. ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత.. కొందరు వరుడి మామ రామ్‌కుమార్ ను ఇదే విషయం అడిగారు. ఎందురు మీ కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు బుల్డోజర్లను వినియోగించారు అని. అందుకు.. రామ్ కుమార్ స్పందిస్తూ.. ఇవి బాబాజీ (యూపీ సీఎం యోగీ) వాడే బుల్డోజర్లు కాదు, వీటి ఉద్దేశ్యం వేరు అన్నారు. మిగతా వారికి భిన్నంగా తాము బిడాయి ఉత్సవాన్ని నిర్వహించాలనుకున్నామని, అందుకు బాగా ఫేమస్ అయిన బుల్డోజర్లు అయితే బాగుంటుందని అలా చేశామని ఆనందంగా చెబుతున్నారు. ప్రజలు సాంప్రదాయకంగా కార్లు, హెలికాప్టర్లను ఉపయోగిస్తారు, కానీ మేము బుల్డోజర్లను ఉపయోగించాము… ఎందుకంటే, దేవుడి దయ వల్ల మాకు కొన్ని JCBలు ఉన్నాయి.. అంటూ అసలు విషయం చెప్పేశారు రామ్ కుమారు.
Also Read : Pencap Removed Lungs 21 Years : పెన్ క్యాప్ మింగేసిన 5 ఏళ్ల బాలుడు.. 21 ఏళ్ల తరువాత ఆపరేషన్ చేస్తే..