Mangal Margi 2025: మహా శివరాత్రికి ముందు అంటే 24 ఫిబ్రవరి 2025, సోమవారం నాడు గ్రహాలకు అధిపతి అయిన ‘కుజుడు’ నేరుగా మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ అంగారక గ్రహ సంచారం సోమవారం ఉదయం 5:17 గంటలకు జరుగుతుంది. మిథున రాశి అధిపతి బుధుడు, ఆయన కుజుడికి శత్రువు. ఇలాంటి సమయంలో కుజుడు నేరుగా శత్రువు రాశిలోకి వెళ్లడం ఒక అశుభ సంకేతం. ఫలితంగా ఈ ప్రభావం 5 రాశుల వారు ఇబ్బందులు పడతారు. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి యొక్క రెండవ, ఐదవ, ఎనిమిదవ, తొమ్మిదవ ఇళ్లను కుజుడు ప్రభావితం చేయబోతున్నాడు. ఈ ప్రభావం వృషభ రాశి వారి ఆదాయం, మాట తీరుపై ప్రభావం చూపుతుంది. వివాహితులు పిల్లలతో సహా ఇతర కుటుంబ సభ్యుల ముందు తమ మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఇంట్లో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులపై కుజుడు మిథునరాశిలో ప్రత్యక్షంగా సంచరించడం వల్ల ప్రభావం చూపుతుంది. ఈ వ్యక్తుల వృత్తి జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగులు ఇంటి నుండి చాలా దూరం బదిలీని ఎదుర్కోవలసి వస్తుంది. కుజుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా మీ ఖర్చులు పెరగడం వల్ల కూడా సమస్యలు తలెత్తవచ్చు.
తులా రాశి:
మిథున రాశిలో కుజుడు ప్రత్యక్షంగా మారడం వల్ల తులా రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఈ వ్యక్తులు దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి రావచ్చు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో, కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. కాబట్టి ఓపికగా ప్రవర్తించండి. తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కుజుడు ప్రత్యక్షంగా మారడం శుభప్రదం కాదు. ఈ వ్యక్తుల జాతకంలో 8వ భాగాన్ని కుజుడు ప్రభావితం చేస్తాడు. దీనివల్ల జీవితంలో అనిశ్చితి ఏర్పడుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేంప చేస్తుంది. మీ కుటుంబ సభ్యులతో వివాదాలు హాని కలిగిస్తాయి. కాబట్టి మీ మాటలను నియంత్రించుకోండి. మునపటి కంటే ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. కుటుంబ కలహాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది.
Also Read: అదిగో ద్వారక.. సముద్రంలో ఎలా మునిగిపోయింది? ఇప్పుడెలా ఉంది?
ధనస్సు రాశి:
ధనస్సు రాశి యొక్క ఏడవ ఇంట్లో కుజుడు సంచరించడం వలన అనేక సవాళ్లు ఎదురవుతాయి. మీ వైవాహిక, వృత్తి జీవితం ప్రభావితం అవుతుంది. కెరీర్‌లో పని విషయంలో ఒత్తిడి ఉంటుంది. ప్రవర్తనలో దూకుడు, ఆధిపత్యం మీకు సమస్యలను సృష్టిస్తుంది. ఆర్థిక విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవసి వస్తుంది. పనులు పెండింగ్ పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పెట్టుబడులు పెట్టి నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఆర్థిక అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.