BigTV English

Health Tips: రాత్రి వేళ కాళ్లు కడుక్కుని పడుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా..?

Health Tips: రాత్రి వేళ కాళ్లు కడుక్కుని పడుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా..?

Health Tips: ఆరోగ్యకరమైన జీవితం ఉండాలంటే చేతులు, ముఖాన్ని శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందనేది అందరి అభిప్రాయం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాదాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు కాళ్లు కడుక్కోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పగలంతా కష్టపడి రాత్రిపూట హాయిగా నిద్రపోవాలని అనుకుంటారు. అయితే ఈ తరుణంలో మంచి నిద్ర కోసం కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం.


మన రోజువారీ జీవితంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, చర్మ సంరక్షణతో పాటు పాదాల సంరక్షణ కూడా అవసరం. ఎందుకంటే పాదాలు శుభ్రంగా ఉంటే మంచి నిద్ర మాత్రమే కాదు, అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కాళ్లు బాగా కడుక్కుని నిద్రపోతే మంచి నిద్ర వస్తుంది. పాదాలను అపరిశుభ్రంగా ఉంచుకుంటే, నిద్రను ప్రభావితం చేస్తుంది. వివిధ వ్యాధులకు కారణం అవుతుంది.

రాత్రి పడుకునే ముందు పాదాలను కడుక్కోకపోతే సూక్ష్మక్రిములు తయారయ్యేందుకు కారణం అవుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖం, చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో, పాదాలను కూడా కడుక్కోవడం అంతే ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో, బయట ఉండే మురికి, దుమ్ము, ధూళి సులభంగా పాదాల్లోకి చేరుతుంది. రోజు షూస్ వేసుకునే వారి పాదాలకు సహజంగా చెమట పడుతుంది. ఫలితంగా పాదాలను శుభ్రం చేయకపోతే, అది వివిధ రూపాల్లో శరీరంపై ప్రభావం చూపుతుంది.


అపరిశుభ్రమైన పాదాలతో పడుకోవడం వల్ల బ్యాక్టీరియాతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. పాదాల చర్మ సమస్యలకు కారణమవుతుంది. ఇది దురద, ఎరుపు, పొట్టు, పగుళ్లు, పొక్కులు, వాపు వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. పాదాల పగుళ్లు సర్వసాధారణమే అయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే అవి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. కొన్నిసార్లు సర్జరీలకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది.

అవసరమైన జాగ్రత్తలు:

పాదాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉండటానికి బయటికి వెళ్లి వచ్చిన తర్వాత పాదాలను కడుక్కోవాలి. రోజుకు కనీసం రెండు సార్లు ఇలా పాదాలను శుభ్రం చేసుకుంటూ జాగ్రత్త ఉండాలి. ఒకసారి స్నానం చేస్తున్నప్పుడు, మరొకటి రాత్రి పడుకునే ముందు. అయితే రాత్రి పడుకునే ముందు కాళ్లను కడగడం మర్చిపోవద్దు. కనీసం వారానికి రెండు సార్లు పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి వాష్‌ చేసుకోవాలి.. ఇలా చేయడం వల్ల కీళ్లు, కండరాలు రిలాక్స్ అవుతాయి. సుఖంగా నిద్రపడుతుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×