Side Effects of Avocado: అవకాడోలో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించేందుకు సహాయపడతాయట.
డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులను తగ్గించేందుకు కూడా అవకాడో హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవకాడో వల్ల ఇంకా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయట. రోజుకు కనీసం ఒక్క అవకాడో అయినా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
పోషకాల గని:
అవకాడోలో విటమిన్ K, C, E, B-విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. శరీరానికి కావాల్సిన పోషణ ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఇవి సహాయపడతాయి.
చర్మ సంరక్షణ:
అవకాడోలో విటమిన్-E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా, మృదువుగా మార్చడానికి తోడ్పడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా అవకాడోలో ఉండే విటమిన్-E హెల్ప్ చేస్తుందని అంటున్నారు.
గట్ హెల్త్:
అవకాడోను తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అవకాడోలో ఉన్న డైటరీ ఫైబర్ గట్ హెల్త్‌ని రక్షిస్తుందట. అంతేకాకుండా మలబద్ధకాన్ని తగ్గించేందుకు కూడా ఇది సహాయపడుతుంది. దీంతో శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి.
ALSO READ: గుమ్మడి గింజలతో కలిగే లాభాలు ఇవే..!
వెయిట్ లాస్:
బరువు తగ్గించేందుకు కూడా అవకాడో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్స్ అధిక మొత్తంలో ఉంటాయి. దీంతో వీటిని తిన్నప్పుడు త్వరగా కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుందట. ఈ రకంగా ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండేందుకు అవకాడో హెల్ప్ చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
అవకాడో అతిగా తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్..?
అవకాడో తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని మితిమీరి తనడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలు అవకాడోను తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే..?
అధిక బరువు:
అవకాడోలో ప్రోటీన్స్‌తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అధికంగా తీసుకోవడం బరువు పెరుగే అవకాశం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇప్పటికే ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు దీనికి దూరంగా ఉండడమ మంచిదని సూచిస్తున్నారు.
అలర్జీ:
అవకాడో తింటే కొందరికి అలర్జీ వచ్చే అవకాశం ఉందట. దీన్ని అతిగా తీసుకున్న చాలా మందిలో పెదాలు, నోరు, గొంతు అలర్జీలతో ఇబ్బంది పడతారట. దీని వల్ల విపరీతమైన దురద, పొక్కులు రావడం వంటివి జరుగుతాయట.
గ్యాస్ ప్రాబ్లం:
అవకాడోలో ఉండే కొన్ని సమ్మేళనాల వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా అవకాడో అతిగా తీసుకుంటే కొందరిలో పేగుల కదలికలపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అందుకే అవకాడోను శరీరానికి కావాల్సిన మోతాదులోనే తీసుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. లేదంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.