BigTV English

S.P. Charan: 20 ఏళ్ల క్రితమే విడాకులు.. అమ్మ మాటలకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయా..!

S.P. Charan: 20 ఏళ్ల క్రితమే విడాకులు.. అమ్మ మాటలకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయా..!

S.P. Charan: ..దివంగత లెజెండ్రీ దర్శకులు, గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubramaniam) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వేల సంఖ్యలో పాటలు పాడి, ప్రేక్షకులను అలరించిన ఈయన.. పలు షోల ద్వారా అటు బుల్లితెర ఆడియన్స్ కి కూడా మరింత దగ్గరయ్యారు. ఇక ఆయన లేని లోటును ఆయన కొడుకు ఎస్పీ చరణ్ (SP Charan) తీరుస్తారేమో అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఎస్పీ చరణ్ విషయానికి వస్తే.. ఈయన సింగర్ మాత్రమే కాదు నటుడు, నిర్మాత కూడా. తాజాగా ఈయన ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘లైఫ్ : లవ్ యువర్ ఫాదర్’.. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం పై ఉన్న ప్రేమతోనే చరణ్ తన పేరును SPB చరణ్ అని మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవిత విషయాలను పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.


20 ఏళ్ల క్రితమే భార్యనుండి విడిపోయాను – ఎస్పీబీ చరణ్..

ఎస్పీబీ చరణ్ మాట్లాడుతూ.. “నేను నా జీవితంలో గెలుపు, ఓటమి రెండింటినీ చూశాను. 2000 సంవత్సరంలో రూ.75 లక్షలు పెట్టి తొలిసారి ఒక సినిమా నిర్మిస్తే.. మొత్తం కోల్పోయాను. నా వ్యక్తిగత కుటుంబ జీవిత విషయానికి వస్తే.. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి, ఇంట్లో పరిచయం చేసి, పెద్దల ఆశీర్వాదంతో వివాహం కూడా చేసుకున్నాను. పెళ్లయిన తర్వాత మయూకా, జాహ్నవి అనే ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు. ప్రస్తుతం వారు న్యూయార్క్ లో చదువుకుంటున్నారు. నేను, నా భార్య 2005లోనే విడాకులు తీసుకున్నాము. ప్రస్తుతం నా పిల్లలు ఇద్దరు కూడా తల్లి దగ్గరే ఉంటున్నారు. అయితే వారిని చూడాలని అనిపించిన ప్రతిసారి న్యూయార్క్ వెళ్లి కనీసం పది రోజులైనా సరే పిల్లలతో కాలక్షేపం చేసి వస్తూ ఉంటాను” అంటూ చరణ్ తెలిపారు.


అమ్మ మాటలకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను..

ఇంకా ఎస్పీబీ చరణ్ మాట్లాడుతూ..” నా పెళ్లయిన కొత్తలో ఎక్కువగా ఖాళీగా ఉన్నాను. నా కెరియర్ స్లో అయ్యేసరికి అమ్మ తిట్టడం మొదలుపెట్టింది. ఈ వయసులో మీ నాన్న కష్టపడుతుంటే.. దున్నపోతులా ఖాళీగా ఉంటావ్ ఏంట్రా అని విసుక్కునేది. ఆ మాటలు నా మనసుకు మరింత గాయాన్ని కలిగించాయి. నా అంతట నేను ఏం చేయలేకపోతున్నానేమో అనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. సరిగ్గా ఆ సమయంలోనే డైరెక్టర్ కే.బాలచందర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సీరియల్ ఆడిషన్ కి వెళ్లి అందులో నటించాను. అక్కడ జరిగిన పరిచయాలతోనే నిర్మాతగా మారిపోయాను” అంటూ ఎస్పీబీ చరణ్ తెలిపారు.

స్టార్ హీరో అయ్యే అవకాశాన్ని కోల్పోయాను..

ఇకపోతే ” నాకు చదువుకునే రోజుల్లోనే హీరోగా అవకాశం వచ్చింది. అది ఎలా అంటే.. అజిత్ (Ajith) , నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఐదేళ్లపాటు కలిసి చదువుకున్నాం. తర్వాత నేను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్ళిపోయాను. సరిగ్గా అప్పుడే డైరెక్టర్ వాసన్ తో ‘ఆశై’ సినిమా కోసం మా నాన్నను సంప్రదిస్తే.. నా చదువు పాడు చేయడం ఇష్టం లేక నాన్న నా ఫ్రెండ్ అజిత్ ని సూచించారు. అలా అజిత్ ఆ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అవడం నాకు సంతోషంగా అనిపించింది. మేము కనిపిస్తే మాట్లాడుకుంటాం తప్ప ఫోన్ చేసి మాట్లాడుకునే అంత పరిస్థితులు లేవు. అయినా అలా నేను స్టార్ హీరో అయ్యే అవకాశాన్ని కోల్పోయినా.. నా స్నేహితుడు స్టార్ హీరో అయినందుకు చాలా సంతోషంగా ఉంది “అంటూ తెలిపారు.

Tags

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×