BigTV English

Neck pain: టెక్ నెక్ (మెడ నొప్పి)కి వ్యాయామం పనిచేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Neck pain: టెక్ నెక్ (మెడ నొప్పి)కి వ్యాయామం పనిచేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Neck pain: తరచూ మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, ల్యాప్ టాప్ ల ముందు పనులు చేస్తున్న వారికి మెడ నొప్పి బాధిస్తుంటుంది. ల్యాప్ టాప్ ల ముందు తల ముందుకు వంచి గంటల తరబడి పనిచేస్తుంటారు. దీంతో మెడ నరాల్లో సమస్య ఎదురవుతుంది. దీనిని టెక్ నెక్ అని కూడా అంటారు. టెక్ నెక్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువ సేపు చూడటం వల్ల ఏర్పడే సమస్యను టెక్ నెక్ అంటారు. తరచూ ఫోన్లను చూడటం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. ఇష్టం వచ్చినట్లు కూర్చుని గంటల తరబడి ఫోన్లలో తలపెట్టి చూస్తుంటారు. దీంతో చాలా మందికి మెడ నొప్పి సమస్య ఏర్పడుతుంది.


సాధారణంగా ఫోన్లు లేదా ల్యాప్ టాప్ ల ముందు పనిచేసేటప్పుడు అయినా మెడను భుజాలపై ఉంచి పనిచేయాలి. ఇలా చేయడం వల్ల గురుత్వాకర్షణ రేఖ అనేది నిటారుగా ఉంటుంది. అయితే ఎక్కువ సేపు మెడను వంచి పనిచేయడం వల్ల ఈ టెక్ నెక్ సమస్య ఎదురవుతుంది. అయితే ఇలా ఏర్పడే సమస్య కారణంగా ఇది దీర్ఘకాలిక సమస్యగా మారిపోతుందని నిపుణులు అంటున్నారు.

టెక్ నెక్ నెమ్మదిగా తలనొప్పిగా మారుతుందట. మెడ నొప్పి నుంచి నెమ్మదిగా తలనొప్పి వంటి సమస్య ఎదురవుతుందని అంటున్నారు. అందువల్ల ల్యాప్ టాప్ ల ముందు కూర్చునే సమయంలో జాగ్రత్తగా, కరెక్ట్ పొజీషన్ లో కూర్చోవాలట. దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది చివరికి దీర్ఘకాలిక సర్వైకల్ స్పాండిలోసిస్‌కు దారి తీస్తుంది. మెడను మాత్రమే కాకుండా, వెనుక భుజాలను కూడా ప్రభావితం చేస్తుంది.టెక్ నెక్ చివరికి సర్వైకల్ స్పాండిలోసిస్‌గా మారుతుంది.


టెక్ నెక్ లక్షణాలు:

దిగువ మెడ, ఎగువ వెనుక భాగంలో నొప్పి, అసౌకర్యం
తలనొప్పి
మెడ, ఎగువ వీపు, భుజాలలో దృఢత్వం
వెర్టిగో

చికిత్స

నొప్పి తీవ్రంగా ఉంటే, ఫిజియోథెరపీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ కండరాల సడలింపులను సిఫార్సు చేస్తారు. “ఈ సమస్యను పరిష్కరించడానికి వ్యాయామం చేయడం, భంగిమను మెరుగుపరచడం చాలా ముఖ్యం” అని నిపుణులు అంటున్నారు.

వ్యాయామాలు:

నాగుపాము భంగిమ
వెన్నెముక భ్రమణాలు
మెడ భ్రమణాలు
వాల్ పుష్-అప్స్

Tags

Related News

Less Sleep Side Effects: రాత్రికి 4-5 గంటలు మాత్రమే నిద్రపోతున్నారా ? నిజం తెలిస్తే షాక్ అవుతారు !

Plastic Lunch Box: బాబోయ్, ప్లాస్టిక్ లంచ్ బాక్స్ వాడితే.. ఇంత డేంజరా ?

Paneer SideEffects: పనీర్ ఇష్టంగా తింటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త

Protein Shake: క్షణాల్లోనే రెడీ అయ్యే.. ప్రోటీన్ షేక్, సూపర్ టేస్ట్‌తో.. !

Gutti Vankaya Curry: నోరూరించే గుత్తి వంకాయ కర్రీ.. ఇలా చేస్తే ఎవ్వరైనా ఫిదానే !

Walk With Friend: ఫ్రెండ్‌తో కలిసి నడిస్తే.. ఇలా జరుగుతుందా? చాలా మిస్ అవుతున్నారు బ్రో !

Hyderabad: లాంఛనంగా ప్రారంభమైన “ది హౌస్ ఆఫ్ కోయిలా”.. అతిథులు వీరే!

Interval Walking Benefits: జాగింగ్ కంటే ఇదే బెస్ట్.. అందుకేనా జపాన్‌లో అంత క్రేజ్ !

Big Stories

×